దోపిడి దొంగలతో గత కొన్ని రోజులుగా నగర వాసులు టెన్షన్స్ పడుతున్నారు.ఇక ఆడవాళ్ల పరిస్దితైతే ఏదైన నగ నట్రా వున్న కాని భద్రంగా దాచుకుని బాధపడుతున్నారు ఎందుకంటే నలుగురికైన చూపించ లేకపోతున్నామని.ఇక నగలు దోచుకునే వాడికి ప్లేస్‌తో సంబంధ లేదు ఒంటిమీద బంగారం వుంటేచాలు.పగలే భద్రతలేదంటే రాత్రి సమయంలో ఎవరైన బంగారం తో అసలే బయటకు వెళ్ళకూడదు.ఎవడు ఏవైపు నుండి వచ్చి దోస్తాడో తెలియదు.ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం కూడ అలాంటిదే.నిమ్స్‌ గేటు వద్ద నిలుచున్న వ్యక్తిపై ఓ దుండగుడు తాను పోలీసునంటూ కాలరు పట్టుకొని దాడి చేసి అతడి మెడలోని చైన్‌ను లాక్కెళ్లిపోయాడు.వివరాల్లోకి వెళ్లితే.




మేడ్చల్‌కు చెందిన రవిచంద్రసింగ్‌ గురువారం నిమ్స్‌కు బంధువులను చూసేందుకు వచ్చాడు.రాత్రి పది గంటల ప్రాంతంలో నిమ్స్‌ దగ్గరవున్న విశ్రాంతి గది నుంచి నడుచుకుంటూ వచ్చి ఫోన్ మాట్లాడుతూ  ప్రధాన గేటు పక్కనే నిలబ డ్డాడు.ఇంతలో ఓ దుండగుడు రవిచంద్రసింగ్‌ దగ్గరకు తాను పోలీసునని,నీపై అనుమానంగా వుంది స్టేషన్‌కు పదా అన్ని వివరాలు అక్కడ మాట్లాడు కుందాం అంటూ కాలరు పట్టుకొని చెంపమీద కొడుతూ లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు.ఏం అర్దం కాని రవిచంద్ర ఎందుకు కొడుతున్నావని అడిగే లోపు క్షణాల్లో దుండగుడు అతని మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని అక్కడి నుండి మాయమయ్యాడు.




అకస్మాత్తుగా జరిగిన ఈ సంగటనతో షాక్ తిన్న భాదితుడు త్వరగా తేరుకుని 100 నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని,బాధితుడి నుంచి వివరాలు సేక రించారు.పోయిన చైన్ నీదేనని ఏమైన ఆధారాలుంటే చూపించమని అడిగారు,వెంటనే భాదితుడు రవిచంద్రసింగ్‌ గురువారం మధ్యాహ్నం 35వేల రూపాయలు పెట్టి కొత్తగా కొన్న బంగారు గొలుసు బిల్లు చూపించడంతో పోలీసులు అప్రమత్త మయ్యారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని,ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి,దర్యాప్తు ప్రారంభించామని పంజగుట్ట పోలీసులు వెల్లడించారు..ఈ సందర్భంలో పంజగుట్ట CI మాట్లాడుతూ,ఎక్కడికైన బయటకు విలువైన వస్తువులు వెంటేసుకుని వెళ్లేముందు చాల అప్రమత్తంగా ఉండాలని మరోసారి ప్రజలను కోరారు..

మరింత సమాచారం తెలుసుకోండి: