ఆర్టికల్ 370 తరువాత జమ్మూకాశ్మీర్ లో అనేక మార్పలు వచ్చాయి. టెలిఫోన్, ఇంటర్నెట్, మీడియాపై అక్కడ ప్రస్తుతం కొన్నిరకాల ఆంక్షలు ఉన్నాయి.  పరిస్థితులు నార్మల్ పొజిషన్ కు వచ్చే వరకు అక్కడ ఈ ఆంక్షలు కొనసాగుతూనే ఉంటాయి.  ప్రస్తుతం జమ్మూలో పరిస్థితి నార్మల్ గానే ఉన్నది.  కాశ్మీర్ అక్కడక్కడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి.  అందుకే అక్కడ ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి.  


త్వరలోనే అక్కడి పరిస్థితులు అదుపులోకి వస్తాయని ప్రభుత్వం చెప్తోంది. కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో స్కూల్స్ ఓపెన్ చేశారు. దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.  అత్యవసర విభాగాలు పనిచేస్తున్నాయి.  అక్కడి గవర్నర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి కేంద్రానికి నివేదికలు పంపుతున్నారు.  మరికొన్ని రోజుల్లోనే అన్ని సర్దుకుంటాయని అంటున్నారు.  అంతేకాదు, ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు గవర్నర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఓపెన్ చేశారు.  


ప్రజలు తమ సమస్యలపై ఆ సెల్ లో ఫిర్యాదులు చెయ్యొచ్చు.  వీలైనంత వెంటనే వాటిపై చర్యలు తీసుకుంటారు.  దీనిపై ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది.  అయితే,  ప్రతిపక్షాలు మాత్రం కాశ్మీర్ ప్రజల గొంతు నొక్కేస్తున్నారని, వారి స్వేచ్ఛను హరిస్తున్నారని గగ్గోలు పెడుతున్నాయి.  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తున్నారు.  వామపక్షాలు కూడా దీనికి మద్దతు తెలపడంతో కాంగ్రెస్ పార్టీ మరింత రెచ్చిపోయింది.  మోడీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. 


కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు దేశ ప్రజలకు తెలియజేయాలని ఆయాపార్టీలు పట్టుబడుతున్నాయి.  ప్రస్తుతం నార్మల్ గానే ఉందని ప్రభుత్వం చెప్తున్నా.. ఎందుకని ప్రతిపక్షాలు వినడం లేదో అర్ధంకావడం లేదు.  ఒకవైపు ప్రభుత్వం అన్ని సర్దుకుంటాయని చెప్తోంది.  కానీ, ప్రతిపక్షాలు మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు.  ఎం జరుగుతుందో చెప్పాలని అంటున్నాయి.  కశ్మీర్‌లో ఏదో బీభత్సం జరుగుతోంది. దాన్ని దాయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. నిజాన్ని బయటి ప్రపంచానికి చెప్పేందుకు మీడియాను అనుమతించడం లేదు అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది.  ఈ వాదనల్లో ఎలాంటి బలం లేదు అని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: