కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంను ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు విచార‌ణ మొద‌లుపెట్టేశారు. ఈ కేసులో బుధవారం అరెస్టయిన చిదంబరాన్ని సీబీఐ అధికారులు గురువారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. జడ్జి అజయ్ కుమార్ కుహర్ వాదనలు విన్నారు. చిదంబరంను కుర్చీలో కూర్చోవాలని జడ్జి సూచించగా, ఆయన సున్నితంగా తిరస్కరించారు. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ సీబీఐ అధికారులు అడిగే ప్రశ్నలకు చిదంబరం సరైన జవాబులివ్వడం లేదని, వారికి సహకరించడం లేదన్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు బయటికి రావాలంటే చిదంబరానికి ఐదురోజుల సీబీఐ కస్టడీ విధించాలన్నారు. దీంతో ఆయ‌న్ను విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.


కాగా, సీబీఐ కోర్టులో ఆస‌క్తిక‌ర వాద‌న‌లు సాగాయి. . సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ సీబీఐ అధికారులు అడిగే ప్రశ్నలకు చిదంబరం సరైన జవాబులివ్వడం లేదని, వారికి సహకరించడం లేదన్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు బయటికి రావాలంటే చిదంబరానికి ఐదురోజుల సీబీఐ కస్టడీ విధించాలన్నారు. ఈ కుంభకోణం మూలాల వరకు వెళ్లాలని, క్విడ్‌ప్రోకో ను బయటపెట్టాల్సి ఉన్నదని చెప్పారు. ఆయనకు 4 రోజుల కస్టడీ విధించింది. ఆయన తరఫు లాయర్లు, కుటుంబసభ్యులు రోజూ వెళ్లి అరగంట కలిసేందుకు అవకాశం ఇచ్చింది. రెండు రోజులకోసారి చిదంబరానికి వైద్యపరీక్షలు జరుపాలని ఆదేశించింది. చిదంబరం తమకు సహకరించ డం లేదని, మరింత లోతుగా ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ఐదు రోజుల కస్టడీ విధించాలని సీబీఐ కోరింది. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ నెల 26వరకు కస్టడీ విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 


ఇదిలాఉండ‌గా, మాజీ మంత్రి చిదంబరాన్ని అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేసినా.. గురువారం ఉదయం వరకు ఎలాంటి విచారణ జరుపలేదు. ఉదయం 10.30కు అధికారుల బృందం విచారణ ప్రారంభించింది. డీఎస్పీ ఆర్ పార్థసారథి నేతృత్వంలోని బృందం దాదాపు 100 ప్రశ్నలను సిద్ధం చేసుకొని చిదంబరం వద్దకు వెళ్లినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయనను పలు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: