అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంట్లో దొంగతనం జరిగింది. అసెంబ్లీ ఫర్నీచర్ ను ఇంట్లోను, క్యాంపు కార్యాలయంలోను వాడుకున్న ఘనుడు కోడెల. గతంలో ఏ స్పీకర్ కూడా పాల్పడని నీచానికి పాల్పడి స్పీకర్ వ్యవస్దనే దిగజార్చేశారు.  కోడెల ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ను అసెంబ్లీకి తరలించాలని అధికారులు రెడీ అవుతున్న సమయంలోనే దొంగతనం చేయటం సంచలనంగా మారింది.

 

అసెంబ్లీ ఫర్నీచర్ ను ఇంట్లోను, క్యాంపు కార్యాలయంలోను ఎందుకు పెట్టుకున్నావంటే అసెంబ్లీలో ఫర్నీచర్ కు భద్రత లేదు కాబట్టే తన దగ్గర పెట్టుకున్నట్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు తన ఇంట్లోనే ఫర్నీచర్ దొంగతనం జరిగిన తర్వాత కోడెల ఏమని సమాధానం చెబుతారు ?

 

కోడెల ఇంట్లో నుండి కొంత ఫర్నీచర్ తో పాటు కంప్యూటర్లను కూడా దొంగలు ఎత్తుకెళ్ళారట. మరి మాయమైన కంప్యూటర్లలో ఎటువంటి డేటా ఉందో కోడెల లేకపోతే డేటా ఆపరేటరే చెప్పాలి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఇద్దరు ఆగంతుకులు వాచ్ మెన్ ను కొట్టారు. ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి మరీ ప్రవేశించి ఫర్నీచర్, కంప్యూటర్లను ఎత్తుకెళ్ళటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

 

శుక్రవారం ఉదయం ఫర్నీచర్, కంప్యూటర్లను తిరిగి అసెంబ్లీకి చేర్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని కోడెలకు సమాచారం కూడా ఇచ్చారు. ఉదయం కోడెల ఇంటికి అధికారులు వెళ్ళటానికి రెడీ అవుతున్న సమయంలోనే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనం జరిగిందంటే ఏమిటర్ధం ?

 

అసెంబ్లీకి సంబంధించిన సుమారు 40 ఏసిలు కొడుకు కోడెల శివరామకృష్ణ హోండా షో రూములో ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే కొంత ఫర్నీచర్ ను కూడా షో రూములో వాడుకుంటున్నారట. ఫర్నీచర్, ఏసిలు కొడుకు షో రూములో ఉందంటే కూతురు ఇంట్లో కూడా ఎంతో కొంత ఉండకపోదు. మరి తాజాగా తన ఇంట్లో జరిగిన దొంగతనంపై కోడెల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అలాగే దొంగతనంపై ప్రభుత్వ స్పందన కూడా చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: