ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు.లోకంలో పరిస్దితులు అలా మారాయి.ఎవరు ఎవరిని నమ్మాలో తెలియని అయోమయ స్దితిలో వున్నారు ప్రజలు.ఇక ముఖ్యంగా పనివాళ్లవిషయంలో మాత్రం చాల జాగ్రత్తగా వుండాలి ఎందుకంటే మీ ఇంటి విషయాలు మీకన్న మీ పనివారికే ఎక్కువ తెలిసే ప్రమాదముంది.అందుకే పనిచేసేవారిని నమ్మాలి కాని అతిగా నమ్మి అన్ని విషయాలు వాళ్లతో పంచుకోకూడదు.అందరు పనివాళ్లు చెడ్డవారని కాదు,అలా అని అందరు మంచివాళ్లలా ఉండరు, ఎవరికి తెలుసు ఏ అవసరం ఎవ్వర్ని ఎలామారుస్తుందో.ఇక ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరంటారు.అయితే బుర్రలో ఆలోచన ఉండాలే కానీ ఎంత తెలివైన దొంగలైనా సులభంగా దొరికిపోతారు అని హైదరాబాద్‌ కు చెందిన ఓ ఇంటి యజమాని నిరూపించాడు..




బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఎమ్మెల్యే కాలనీలో భీంరెడ్డి పటేల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.రోజు అతనికి వచ్చిన డబ్బులు బీరువాలో దాచి తాళాలు అక్కడే ఓ చోట పెడుతుంటాడట కొద్దిరోజులుగా భీంరెడ్డి బీరువాలో దాచుకున్న నగదు కొంచెం కొంచెం మాయవడం గ్రహించాడట,అతను ఎంత నిఘా పెట్టినా దొంగను పట్టుకోలేకపోయాడు,రోజూ డబ్బులు పెట్టడం తర్వాతి రోజుకు కొంత నగదు తగ్గడం జరుగుతూనే ఉంది.ఇది ఇంటి దొంగల పనే అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి.అలా అని ఆ ఇంటిలో వున్నవారికి ఈ విషయం చెప్పలేదు.తానే ఏదోఒకటి చేసి ఆ ఇంటిదొంగను పట్టుకోవాలని ఆలోచిస్తుండగా వెంటనే అతనికి  ఓ ఆలోచన వచ్చింది.రెండ్రోజుల క్రితం బీరువాలో రూ.2,100 నగదుపెట్టి ఆ నోట్ల నంబర్లన్ని రాసుకుని ఏమి తెలియనట్లు వెళ్లిపోయి మధ్యాహ్నం వచ్చి చూసేసరికి బీరువాలో డబ్బులు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.




దీంతో భీంరెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు అతడి ఇంట్లో పనిచేస్తున్న వారిని ప్రశ్నించగా,ఎవ్వరూ కూడా తమకే పాపం తెలీదని చెప్పడంతో ఏం చేయాలో మొదట వారికి అర్దంకాలే.ఆ వెంటనే భీంరెడ్డి తాను రాసుకున్న నోట్లనంబర్లు చెప్పడంతో పోలీసులు పనివాళ్ల దగ్గర నోట్లను చెక్ చేశారు.చివరికి ఉప్పరి అఖిల అనే పనిమనిషి వద్ద ఎక్కువ నోట్లు ఉండటంతో ఆమెను ప్రశ్నించారు. ఆప్రశ్నలకు ఎలాంటి బెరుకు లేకుండా ఆ నోట్లు తనవేనని బుకాయించింది.ఐతే ఆమె దగ్గరున్న నోట్లు భీంరెడ్డి చెప్పిన నోట్లనంబర్లతో సరిపోవడంతో అఖిలే దొంగ అని నిర్ధారించుకున్నారు పోలీసులు.లేడికానిస్టేబుల్ ఒకరు గట్టిగా ప్రశ్నించడంతో తానే దొంగతనం చేసినట్లు మారుతాళం చెవితో ఆ డబ్బులు మాయం చేస్తున్నట్లు ఒప్పుకుంది. నిందితురాలి ని అరెస్ట్ చేసి ఆమెదగ్గరున్న డబ్బులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు  తరలించినట్లు తెలిపారు బంజారాహిల్స్‌ పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: