వారు మధ్యతరగతి దంపతులు వారికి ఓ కుమారుడు,ఇద్దరు కుమార్తెలున్నారు.గత రాత్రి తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె,కొడుకుతో కలసి ఆస్పత్రికి వెళ్ళింది.ఇకపోతే అదే గల్లీలో వుండే,15ఏళ్ల బాలుడు ఆ సమయంలో ఆడపిల్లలిద్దరే ఇంట్లో ఉన్న విషయాన్ని గ్రహించి,ఇంట్లోకి ప్రవేశించి పెద్ద అమ్మాయిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు,ఈ దృష్యాన్ని చూసిన ఆమె చెల్లి కేకలు వేస్తూ అతన్ని అడ్డుకొనగా చెంపపై కొట్టి జుట్టుపట్టుకుని లాకెళ్లి మరో గదిలో బంధించాడు.తన కళ్లముందే అక్కపై అత్యాచారం జరుగుతున్న ఆపలేని పరిస్దితిలో ఆ చెల్లెలు కేకలు వేస్తున్న ఎవరు రాలేదట.




కాసేపట్లో తాపీగా తనపని కానిచ్చుకున్న ఆ కామాంధుడు పనిపూర్తి చేసుకున్న తర్వాత ఇంటి తలుపులు మూసేసి వెళ్లిపోయాడట.కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన,తల్లి,కొడుకులకంట అక్కచెళ్లెళ్ళు ఇద్దరు ఏడుస్తూ కనిపించగా,పెద్దమ్మాయి భయంతో తల్లిని చూసి ఇంకా ఎక్కువగా ఏడ్వడం మొదలుపెట్టిందట.వారివాలకం చూసిన తల్లి విషయం తెలుసుకుని ఎంతో వేదనగా రోదిస్తూ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తారట.ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో జరిగింది.




సంఘటన జరిగిన తర్వాత బాధితురాలిని వెంటనే చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించగా చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్ బాలుడిని అరెస్ట్ చేసి,పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు.ఇక అరెస్ట్ చేసిన పోలీసులు బాలుడిని జువెనైల్ హోమ్‌కు తరలించారు.ఇక అత్యాచారాలు,లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించిన విషయాల్లో గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు,వివరాలు వెల్లడించలేదని చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు..గడిచిన గత రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఎంతో కలకలం రేపుతుంది.సభ్యసమాజం తలదించుకునే విధంగా మారుతున్న ఈ కాలంలో చట్టాలు మరింతగా పటిష్టంగా మారవలసిన అవసరం వుందని ఈ విషయం తెలసిన వారు అనుకుంటున్నారు.రోజురోజుకు ఆడపిల్లజీవితానికి భద్రత కరువైన ఈ సమాజంలో ఇకముందు ఎలాజీవించాలో వారికి చిన్నప్పటినుండే చెప్పితే ఉపయోగం వుంటుందని కొందరి అభిప్రాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: