రేషన్‌ కార్డులకు ఈకేవైసీ చేయించుకోవాలనే నిబంధనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలస్యమైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవేమోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఇందుకు అవసరమైన కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆధార్‌ ప్రాధికార సంస్థ ప్రాంతీయ కార్యాలయం విఫలమవుతోంది. ఇప్పటివరకూ ఆధార్ నమోదు కేంద్రాలు ప్రైవేటు ఆపరేటర్ల చేతుల్లో ఉండడంతో జనన వివరాల నమోదులో అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తించిన కేంద్రం.. వీటిని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోనే ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.

 


ఆధార్‌ లో మార్పులు చేయించుకునే వారు, అయిదేళ్లలోపు పిల్లలకు వేలిముద్రలు నమోదు చేసి ఈకేవైసీ చేయించేవారు ఎక్కువగా ఉన్నారు. రోజుకు 10 నుంచి 15 మందికి మాత్రమే ఆధార్‌ నమోదు, సవరణలు చేస్తూండడంతో రోజూ రద్దీ ఎక్కువగా ఉంటోంది. వివరాల నమోదు, మార్పులు చేసే ఆపరేటర్లకు పరిజ్ఞానం లేకపోయినా, టెక్నికల్ సమస్యలు వచ్చినా నమోదు నిలిచిపోతోంది. పేరు మార్పుకు పదో తరగతి మార్కుల పత్రం గెజిటెడ్‌ అధికారి లెటర్‌హెడ్‌పై తీసుకెళ్లాలి. పుట్టిన తేదీ మార్పు రెండేళ్లకు మించి చేయాలంటే ముందు ఇక్కడ నమోదు చేయించుకుని తిరస్కరణకు గురయ్యాక ఆ పత్రాలతో హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం వరకు వెళ్లాల్సిందే. వీటిపై సరైన ప్రచరారం లేకపోవడం కూడా ఇబ్బందవుతోంది. ఆన్‌లైన్‌లో ఆధార్‌ సవరణకు అడ్రస్ మార్పుకు మాత్రమే అవకాశం ఉంది. ఇందుకు మొబైల్‌ నంబర్‌ యాడ్ చేసుకునేందుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.

 

 

పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఆధార్‌ నమోదు కేంద్రాలున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోయింది. అవసరమైనంత వరకే ఆధార్‌ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని, ఏపీలో ఎన్ని కేంద్రాలున్నాయో ఉన్నతాధికారులకే స్పష్టత లేకుండా ఉంది. మీసేవలో ఒక ఆపరేటర్‌, తహసీల్దారు కార్యాలయంలో మరో ఆపరేటర్‌ను నియమించుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 750 కేంద్రాల్లో మాత్రమే ఆధార్ సేవలు అందుతున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: