హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారం మరోసారి కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక భాగంలో ఇతర మతాలకు చెందిన యాడ్స్ కనిపించడంతో భక్తులు షాక్ తిన్నారు. ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేమ్ కు సంబంధించిన యాత్ర కు సంబంధించిన యాడ్సు టిక్కెట్ల వెనుక భాగంలో దర్శనమిచ్చాయి. గవర్నమెంట్ సర్వీస్ కు సంబంధించిన ఒక సంస్థ అది ఏపీఎస్ ఆర్టీసీ. ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ ల వెనుక ఇలాంటి యాడ్స్ చాలా సర్వ సాధారణంగా చూస్తుంటాం. కానీ, తిరుమలకు సంబంధించిన టికెట్ ల వెనుక ఉండటం ఎంత మాత్రం హర్షణీయం కాదు.


ఇంత చిన్న లాజిక్ ని ఏపీఎస్సార్టీసీ ఎలా మిస్సయ్యింది.  మామూలుగా ఆర్టీసీ టికెట్ వెనుక గానీ, రైల్వే టికెట్ ల వెనుక గానీ ఒక ప్రకటనలు అయితే ఉండడం అనేది సర్వసాధారణం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారం అయితే జరుగుతుంది. అయితే, ఇది ఏ విధంగా తిరుమలకొచ్చింది అనేది ప్రస్తుతం చర్చగా మారింది. నిన్న తిరుపతి నుంచి తిరుమలకు అంటే యాభై ఐదు రూపాయల టికెట్ కు సంబంధించిన ఒక టికెట్ వెనుకాల జెరూసలెం, హజ్ యాత్రకు సంబంధించిన ఒక ప్రచారమైతే జరిగింది. దాన్ని చూసిన భక్తులు వెంటనే ఒక్క సారిగా అవాక్కయ్యారు. టీటీడీ విజిలెన్స్ అధికారులకు, ఆర్టీసీ అధికారులకు కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆర్టీసీ అధికారులు ఈ టికెట్ లు ఎక్కడి నుంచి వచ్చాయని తిరుపతిలోని అలిపిరి డిపోకు వచ్చారు.


అక్కడకు వచ్చి ఆ టికెట్స్ ఎలా వచ్చాయని దర్యాప్తు చేశారు. అయితే నిన్న ఆర్టీసీ తిరుమల డిపో మేనేజర్ చెబుతున్న వాదన ప్రకారం కొన్ని పేపర్ లు వచ్చాయి, ఈ పేపర్ లు అనగా రోల్స్ అవి విజయవాడ సెంట్రల్ ఆఫీసు నుంచి వచ్చాయి అని తెలిపారు. అయితే ఈ టికెట్ల వెనుకాల ఏ రకంగా టిమ్స్ మిషన్ లో లోడ్ చేశారు అన్నది, తెలియకుండా వచ్చాయి అని చెప్పి గుర్తించారు. భక్తులు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ టిం మిషన్ లో ఉన్నటువంటి రోల్స్ ని తీసివేసి తిరిగి కేవలం తెల్ల పేపర్ ఉండే రోల్స్ ని ఇచ్చి టికెట్లిచ్చారు. అయితే ఈ అంశం ఒక వివాదాస్పదంగా మారిపోయింది. తిరుమలలో మరోసారి అన్యమత ప్రచారానికి తెర తీశారు అనే అంశంపై పెద్ద ఎత్తున బిజెపితో పాటు హిందూ మత సంస్థలన్నీ కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: