ఏపీ మాజీ స్పీకర్ కోడెల కార్యాలయం దగ్గర హైడ్రామా నెలకొంది. కంప్యూటర్ ల దొంగతనం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత దొంగలు రెండు కంప్యూటర్ లు దొంగలించినట్లు వార్తలు రాగా తరువాత వాళ్ళు కార్యాలయ పాత సిబ్బందిగా తేలింది. సత్తెనపల్లి మున్సిపల్ ఉద్యోగి అర్జునుడు పాత్ర పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కోడెల కార్యాలయంలో పని చేసిన అర్జునుడు ఇప్పుడు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సన్నిహితంగా మెలుగుతున్నట్టు సమాచారం అందుతోంది. కోడెల కార్యాలయానికి సమీపంలో దొంగతనానికి గురైన కంప్యూటర్ లు పోలీసులకు లభించాయి. డేటా చోరీ చేసి కంప్యూటర్ లు పడేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.


అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపుకు కొద్ది గంటల ముందు చోటు చేసుకున్న ఈ నాటకీయ పరిణామాలపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. తన కార్యాలయంలో కంప్యూటర్ లు చోరీ వెనుక వైసీపీ హస్తం ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. విద్యుత్ రిపేర్ల కోసమంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి కంప్యూటర్ లు అపహరించారని వారిలో అర్జునుడు అనే వ్యక్తి వైసీపీ కార్యాలయంలో పని చేస్తున్నాడని కోడెల చెప్పారు. వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనుమతితోనే అర్జున్ తన కార్యాలయానికి వచ్చాడని దీని పై అంబటి స్పందించాలని కోడెల డిమాండ్ చేశారు.


అసెంబ్లీ ఫర్నిచర్ గుంటూరులో భద్రంగా ఉందని అన్నారు. టీడీపీ నేతలను కార్యకర్తలను అధికార పక్షం బతకనివ్వడం లేదని వేధింపులకు గురి చేస్తుందని కోడెల మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో అధికారులొచ్చి ఫర్నీచర్ కు సంబంధించినటువంటి స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ స్థానిక పోలీసులు కూడా అధికారుల సహాయం కోరారు అని చెప్పి ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే ఈ రోజు సెలవు కావడంతో అధికారులు వస్తారా లేదా అన్న అనుమానం అయితే వ్యక్తం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: