ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. ఈ నియామకం జరిగి కూడా రెండు నెలలు దాటుతోంది. మరి బోర్డు ని మాత్రం ఇంతవరకు జగన్ ఏర్పాటు చేయలేదు. దాంతో బోర్డు మెంబర్లు గా ఎవరిని నియమిస్తారన్న చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. ఆశావహులు కూడా పెద్ద ఎత్తున ఉండడంతోనే జగన్ బోర్డ్ ఏర్పాటుని ఎప్పటికపుడు వాయిదా వేస్తున్నాని అంటున్నారు. అయితే తాజాగా బోర్డు  కూర్పు విషయంలో కీలకమైన నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని అంటున్నారు.


టీటీడీకి ఈసారి జంబో జట్టు ఉండొచ్చన్న మాట గట్టిగా వినిపిస్తోంది.  జగన్ ప్రభుత్వం 25 మందితో టీటీడీ బోర్డుని  నియమించాలని నిర్ణయించిందని అంటున్నారు. గతంలో ఈ సంఖ్య పదిహేను వరకు మాత్రమే ఉండగా అదనంగా మరో పదిమందికి అవకాశాలు కల్పిస్తారని అంటున్నారు. బోర్డుని పూర్తి స్థాయిలో నియమించకపోవడం వల్ల ఇప్పటివరకూ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.  కేవలం సుబ్బా రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఇతర అధికారులతో సంప్రదించి  కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మాత్రమే  తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కొత్త బోర్డు మీద అందరి చూపు పడింది.


బోర్డు మెంబర్ల కోసం చాల చోట్ల నుంచి జగన్ మీద ఒత్తిడి వస్తోంది.  ఏమైనప్పటికీ వివిధ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయవలసి ఉన్నందున, పార్టీ నాయకులలో కొంతమందిని ట్రస్ట్ బోర్డులో చేర్చాలని జగన్  భావించినట్లుగా తెలుఇస్తోంది. దాంతో కొత్త  బోర్డులో 25-26 మంది సభ్యులను నియమించి జంబో జట్టుగా చేయాలని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు  ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సిఫారసు చేయాల్సిన కేంద్ర కోటా కింద తెలంగాణకు చెందిన ఇద్దరు, చెన్నై నుండి ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఇద్దరు సభ్యులు టీటీడీ బోర్డులో తప్పనిసరిగా ఉంటారని అంటున్నారు. 


మిగిలిన సభ్యులలో  వైసీపీ  ఎమ్మెల్యేలు లేదా  పార్టీ సీనియర్ నాయకులను నియమించడం ద్వారా జగన్ ఆశావహులకు తగిన న్యాయం చేయాల్ని భావిస్తున్నారట. అంటే గతంలో 15 మందితో ఉన్న టీటీడీ బోర్డు ఇపుడు 26 మంది దాకా పెరిగే అవకాశాలు  స్పష్టంగా కనిపిస్తున్నాయి.  మొత్తానికి పాతికకు పైగా సభ్యులతో టీటీడీ బోర్డు ఇకపై కళకళలాడిపోతుందన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: