ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల 12 వ తేదీన కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఫోక్స్ వ్యాగన్ కేసులో బొత్సా సత్యనారాయణకు ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఫోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్ వ్యాగన్ కేసు వ్యవహారంలో బొత్సా సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి. అప్పట్లో బొత్సా సత్యనారాయణ భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005 సంవత్సరంలో ఈ కేసు నమోదైంది. ఫోక్స్ వ్యాగన్ కంపెనీని హైదరాబాద్ నుండి వైజాగ్ కు తరలించే వ్యవహారంలో బొత్సా సత్యనారాయణతోపాటు మరికొంత మందికి ముడుపులు అందాయనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును పరిష్కరించమని సీబీఐకు అప్పగించటం జరిగింది. 
 
ఈ కేసులో దాదాపు 12 కోట్ల రుపాయల వరకు అవినీతి జరిగిందని ఆరోపణలు రాగా 7 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసినట్లు సమాచారం. మిగతా డబ్బు ఇంకా రికవరీ జరగాల్సి ఉంది. ఈ కేసులో 59 మంది సాక్షులను విచారించినట్లు మూడు వేలకు పైగా పేజీల చార్జ్ షీట్ సీబీఐ దాఖలు చేసినట్లు సమాచారం అందుతుంది. వశిష్ఠ వాహన అనే కంపెనీకు డైరెక్టర్ గా ఉన్న జైన్ అనే వ్యక్తి ఈ కేసులో అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
ఈ కేసు జరిగిన సమయంలో ఏపీ రాష్ట్రానికి పరిశ్రమల శాఖా మంత్రిగా బొత్సా సత్యనారాయణ ఉన్నందువల్లే నోటీసులు అందినట్లు సమాచారం. మరి ఈ కేసుకు సంబంధించి బొత్సా సత్యనారాయణ ఏం చెబుతాడో తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ నెల 12 వ తేదీన బొత్సా సత్యనారాయణ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కాబోతున్నాడు. 
 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: