పత్రికా రంగంలో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ జర్నలిస్ట్ ఆచంట సుదర్శన్ రావు శుక్రవారం కన్నుమూశారు.  సమాజంలో అణగారిపోతున్న పరిస్థితులపై ఆయన ఎన్నో విప్లవాత్మక వార్తలు రాశారు.  ఆయన వద్ద శిష్యులుగా ఎన్నో మెలుకువలు నేర్చుకున్నవారు నేడు టాప్ జర్నలిస్టులుగా కొనసాగుతున్నారు.

అంతే కాదు ఆయన ఈనాడు దిన పత్రికలో 30ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన పాత్రికేయుడిగా 40ఏళ్లకు పైగా సేవలందించారు. ఇక జర్నలిజం పాఠశాల అధ్యాపకుడిగా ఎంతో మంది యువతను మంచి జర్నలిస్టులుగా తీర్చి దిద్దారు.  ఇటీవల ఆయన అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. 1970 లో ‘సమతా రచయితల సంఘం’ సాహితీ సంస్థను స్థాపించారు.

ఈ సంఘంలో ఎంతో మంది రచయితలు పనిచేశారు.  ఇక  ‘సమతా రచయితల సంఘం’ ద్వారానే  సిరివెన్నెల సీతారామశాస్త్రి, ద్వానాశాస్త్రిలు వెలుగులోకి వచ్చారు.  ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిరివెన్నల సినిమాలో అద్భుతమైన పాటలకు రచన చేసి ఆ సినిమా టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. సుదర్శనరావు మృతి పట్ల సాహితీ, పాత్రికేయ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: