మనిషి మనుగడ సాగించాలని అంటే ముఖ్యంగా కావాల్సింది గాలి.  గాలిలోని ప్రాణవాయువు.  ప్రాణవాయువు లేకుండా మనిషి ఒక్క క్షణం కూడా బ్రతకలేడు.  ఇప్పుడు గాలిలో కాలుష్యం ఎక్కువైపోవడంతో మనిషి ఇబ్బందులు పడుతున్నాడు.  రకరకాల జబ్బులకు గురవుతున్నాడు.  ప్రపంచంలోని మానవాళికి అత్యధిక శాతం ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టక్కున చెప్పే సంధానం అమెజాన్ అడవుల నుంచి.  


20శాతం ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుంచి లభిస్తోంది.  ఈ స్థాయిలో ఆక్సిజన్ లభించడం అంటే మాములు విషయం కాదు.  అలాంటి అమెజాన్ అడవి ఇప్పుడు అగ్నికి ఆహుతి అవుతున్నది.  మంటలు చెలరేగడంతో గత కొంతకాలంగా అమెజాన్ అడవులు తగలబడిపోతున్నాయి.  ఆ అడవుల్లో ఉన్న అరుదైన జాతి మొక్కలు, అరుదైన జంతువులు అగ్నికి ఆహుతౌతున్నాయి. అంతేకాదు.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అడవుల్లో బ్రతికే మనుషులు ఇబ్బంది పడుతున్నారు.  


వేలాది ఎకరాలు అగ్నికి ఆహుతి అవుతున్నది.  అమెజాన్ అడవుల్లో అగ్ని కీలలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  దీనిపై సెలెబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.  ప్రపంచం ఊపిరిత్తుత్తులు కాలిపోయాయని,  అగ్ని నుంచి అడవుల్ని ప్రార్ధిస్తూ ట్వీట్ చేస్తున్నారు. దాదాపు 10 లక్షలమంది ఆదిమజాతి మనుషులు ఆ అడవుల్లో నివసిస్తున్నారు.  నియంత్రించే దశ నుంచి నియంత్రించలేని దశగా మంటలు చెలరేగాయి.  అమెజాన్ అడవులు ఎక్కువగా ఉన్న బ్రెజిల్ చేతులు ఎత్తేసింది.  


ఇప్పుడు అడవులను కాపాడాలని ప్రపంచాన్ని బ్రెజిల్ వేడుకుంటోంది.  అందరు కలిసికట్టుగా సహాయ సహకారాలు అందిస్తేనే అడవుల్లో చెలరేగిన కార్చిచ్చుఆపొచ్చు.  ఆలా చేయకపోతే.. అడవి మొత్తం అగ్నికి ఆహుతికాక తప్పదు.  ఆక్సిజన్ లభించక ప్రపంచం నాశనం కాక తప్పదు.  అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండాలంటే.. ప్రతి ఒక్కరు సంఘటితంగా పోరాటం చేసి.. అడవిని కాపాడుకోవాల్సిందే.  అమెరికాతో సహా ప్రతి ఒక్కరు ఈ పనికి ముందుకు వస్తే నియంత్రించడం ఈజీ అవుతుంది.  మానవాళిని రక్షించుకున్నట్టు అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: