గత ప్రభుత్వం అడిగితే రాజధాని కోసం తాము భూములు ఇచ్చామన్నారు అమరావతి ప్రాంత రైతులు. ఈ రోజు ఏపి, బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన రైతులు ప్రభుత్వం మారిన తరువాత ఇబ్బందులు వస్తున్నాయని ఆయన చెప్పారు. మంత్రి బొత్స వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని రాజధానుల్లో పనులు పూర్తిగా ఆగిపోయాయని కన్నా దృష్టికి తీసుకువచ్చారు. భూములిచ్చిన రైతులకు ఇప్పుడు కౌలు కూడా ఇవ్వడం లేదని సీఆర్ డీఏ అధికారులను కలిసిన, స్పష్టత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిని అమరావతి నుంచి మార్చకుండా చూడాలని కోరుతున్నామన్నారు రైతులు.


దీనిపై రైతులు మాట్లాడుతూ, రాజధాని మీద ఒక ప్రకటన చేశారని, దాని మీద ఇరవై ఐదు వేల మంది రైతులు అయోమయానికి గురయ్యారని చెప్పారు. రైతులంతా దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఢిల్లీలో విజయసాయిరెడ్డి గారు రైతులు ఏం పని చేసిన కేంద్ర ప్రభుత్వంతో, ప్రధాన మంత్రి గారితో, అమిత్ షాతో మాట్లాడి చేస్తాం అంటే ఇంకా అయోమయానికి గురయ్యి చాలా రైతులకి, భూములిచ్చిన రైతులకి రాత్రిపూట నిద్రలేకుండా ఉండే పరిస్థితి వచ్చిందన్నారు. రైతుల తాతల, ముత్తాతల ఆస్తులు ఇచ్చారనీ, అయితే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు, చంద్రబాబునాయుడు ఆ రోజున ఉన్న గవర్నమెంట్ అడిగారు కాబట్టి భూములిచ్చామన్నారు. ఆ భూములు వారు ఇచ్చిన దానికి ఇప్పుడు అయోమయానికి గురిచేశారన్నారు


ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడు కాబట్టి రైతులందరూ ఆయనకు విన్నవించుకున్నామన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం వార్షిక కౌలు రాలేదని వారంతా మధ్య తరగతి రైతులని, కౌలు మీద ఆధారపడి బ్రతికేవాళ్లని ఆంధోళన చెందారు. రాజధాని అభివృద్ధి చేయాలి కదా అని అక్కడ ప్రజలు వాపోతున్నారు. మా భూములిచ్చాం మళ్ళీ  రిటర్నబుల్ ప్లాట్ లు కావాలి అంటే మాకు అభివృద్ధి కావాలని, ఆ రెండింటి విషయాల మీద రాజధాని తరలింపు ఇక్కడే ఉండాలి అమరావతి అని, రైతులంతా కన్నా లక్ష్మినారాయణని అడగటానికి వచ్చాం అని అన్నారు. రైతులందరూ చాలా బాధలో ఉన్నామన్నారు. మాకు రాజధాని ఇక్కడే ఉండాలి, మా రాజధాని అభివృద్ధి చేయాలి, మాకు ప్రతి సంవత్సరం ఇచ్చే కౌలు మాకివ్వాలి, మా రాజధాని డెవలప్ మెంట్ చేయాలని మేము రైతులందరము కోరుతున్నామని అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: