తెలంగాణలో  అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండో సారి విజయం సాధించినప్పటికీ..  పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కు కాస్త చేదు అనుభవమే మిగిలింది.  టీఆర్ఎస్ కేవలం 9 స్థానాలనే గెలిస్తే..  బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 4 స్థానాలను గెలవడం.. పైగా  కేసీఆర్  కూతురు గతంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్నా..  ఈ సారి మాత్రం బీజేపీ చేతిలో ఓడిపోవడం.. ఇప్పటికీ అది  టీఆర్ఎస్ పార్టీకి  పెద్ద దెబ్బగానే  మిగిలిపోయింది. దీనికి తోడు 17 పార్లమెంట్ స్థానాలలో 16 స్థానాలను గెలిచి..  కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి..  చక్రం తిప్పుతానని చెప్పుకొచ్చిన కేసీఆర్‌,  మొత్తానికి  మోదీకి శత్రువుగా మారాడు.  అయితే తాజాగా కవితకి కేసీఆర్ కొత్త పదవి ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం తెలంగాణలో   రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి ఖాళీ అవ్వడంతో..  ఆ పదవినైనా  కవితకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందన్నట్టు టాక్ వినిపిస్తోంది.  నిజానికి నిజామాబాద్‌ లో రైతుల తిరుగుబాటు వలనే కవిత ఓడిపోయిందట. ఇప్పుడు రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని గాని, కవితకు ఇస్తే..   రైతులతో ఆమెకు సమన్వయం పెరిగేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఎప్పటినుండో  కవితకు పదవి ఇవ్వాలని  కేసీఆర్ ఆశ పడుతున్నారు.  మరి ఆ ఆశ ఇప్పుడు అన్నా నెరవేరుతుందా ? నెరవేరితే..  కవిత ఈ సారైనా ఆ పదవిని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటారో లేదో చూడాలి. 


ఎందుకంటే  గతంలో ఎంపీగా పని చేసినా కవిత  నిజామాబాద్ ప్రాంతాన్ని పట్టించుకోలేదని, పసుపు బోర్డ్ విషయంలో పూర్తిగా విఫలమైందని ఆమె పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఇలా ఆమె పై చాలానే ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రస్తుత టీఆర్ఎస్ పరిస్థితికి వస్తే.. రోజురోజుకి ఆ పార్టీ ప్రజల్లో బలాన్ని కోల్పోతుందనే చెప్పాలి.   రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వాలు పెరగడం,  అది చూసి  టీఆర్ఎస్ నాయకులు ఉలికిపాటుకు గురవుతున్నారని  బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.  ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో బీజేపీ పట్టు పెంచుకుంటోందని అన్నారు. ఈ విషయం నిజమే అని చెప్పుకోవాలి.   బీజేపీవి ఉత్త లెక్కలు అంటూ మొన్న కేటీఆర్ తీసి పడేసిన.. బీజేపీకి ఇక్కడ బలం పెరుగుతుంది.  ఒక విధంగా  చెప్పుకుంటే..  టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదే అశాస్త్రీయంగా జరుగుతోంది.  ఈ పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయేలానే కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: