అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొడుకు శివరామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదైంది. దొంగతనంగా అసెంబ్లీ ఫర్నీచర్ ను తమ హోండా షో రూములో ఉంచుకున్నందుకు శివరామ్ పై అసెంబ్లీ అధికారులు క్రిమినల్ కేసు పెట్టారు. అసెంబ్లీకి చెందిన కుర్చీలు, 42 ఏసిలు, టేబుళ్ళు తదితరాలను అక్రమంగా తన షో రూములో శివరామ్ ఉంచుకున్న విషయం అందరికీ తెలిసిందే.

 

హైదరాబాద్ నుండి అమరావతికి అసెంబ్లీ మారినపుడు నాలుగు లారీల ఫర్నీచర్లో ఒక లారి మిస్ అయ్యింది. ఆ విషయాన్ని గుర్తించిన అధికారులు కోడెలకు చెప్పినా పట్టించుకోలేదు. అంటే నాలుగేళ్ళు అలానే గడిపేశారు కోడెల. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుండి కోడెలకు కష్టాలు తప్పలేదు.

 

వైసిపి అధికారంలోకి రాగానే నరసరావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో అసలు విషయం బయటకు వచ్చింది. గోపిరెడ్డి ఫిర్యాదును స్పీకర్ పోలీసులకు పంపి విచారించమని ఆదేశించారు. దాంతో పోలీసులు లాగిన తీగతో డొంకంతా కదిలింది. మిస్ అయిన అసెంబ్లీ ఫర్నీచర్ కోడెల ఇంట్లోను, క్యాంపు కార్యాలయంలోను, కొడుకు షో రూములోను ఉందని అందరికీ అర్ధమైపోయింది.

 

ఎప్పుడైతే పోలీసులు విచారణ మొదలుపెట్టారో వెంటనే కోడెల మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఫర్నీచర్ తన ఇంట్లోను, క్యాంపు కార్యాలయంలోనే ఉందని అంగీకరించారు. అయితే తన కొడుకు షోరూములో ఫర్నీచర్ ఏమీ లేదని చెప్పారు. కానీ పోలసుల సోదాల్లో ఫర్నీచర్లో ఎక్కువ భాగం గుంటూరులోని  షోరూములోనే ఉందని తేలిపోయింది. దాంతో శివరామ్ పై వచ్చిన ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఉండాల్సిన ఫర్నీచర్ తన షో రూములో ఎందుకు ఉందో శివరామ్ చెప్పేదాన్ని బట్టి మాజీ స్పీకర్ పైన కూడా కేసు విషయం పోలీసులు ఆలోచిస్తారు. మొత్తానికి ఐదేళ్ళలో కోడెలతో సహా సంతానం చేసిన పాపాలన్నీ ఇపుడు బద్దలవుతున్నట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: