తప్పు ఎవరు చేసిన తప్పే. మరీ ఈ యాంత్రికయుగంలో లోకం పోకడ ఎటు నుంచి ఎటు పోతుందో అర్ధం కానీ పరిస్థితి. ఆడా, మగా తేడా లేకుండా నేరతీవ్రత పెరిగిపోతుంది. వివరాల్లోకెళితే.. గతంలో ఆడపిల్ల పుట్టిందని భార్యలపై దాడి చేసిన భర్తల గురించి చదివుంటాం. కానీ ఇక్కడ  పూర్తి రివర్స్‌లో ఉండే దారుణమైన ఘటన మహారాష్ట్రలో జరిగింది.


పాల్‌ఘర్ జిల్లా నలాసోపార ప్రాంతానికి చెందిన ప్రణాలీ సునీల్ కదమ్ అనే మహిళ ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే రెండో సారి కూడా ఆడపిల్ల పుట్టడంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యింది. ఈ విధంగా జరగడానికి తన భర్తే కారణమని బలంగా నమ్మిన ఆ భార్యామణి.. అతడితో తరచూ గొడవలకు దిగేది. కాగా మంగళవారం రాత్రంతా కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం 5.00లకు భర్త గాఢ నిద్రలో ఉండగా.. ప్రణాలీ అతడిపై కత్తితో దాడి చేసింది. కసి తీరా పలుమార్లు అతడి శరీరాన్ని తూట్లు పొడిచింది.


దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కంగారుపడ్డ ఆమె రక్తపు మరకలన్నీ తుడిచేసింది. అనంతరం భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని తన అత్తమామలను నమ్మించే ప్రయత్నం చేసింది. కాగా స్పృహ లేకుండా పడి ఉన్న కొడుకుని వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చాలా రక్తం కోల్పోవడంతో బాధితుడు ఆసుపత్రిలో మృతి చెందాడు. ఇదిలావుంటే.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విచారణ సందర్భంగా ప్రణాలీ తాను అమాయకురాలినని, తాను ఏ తప్పు చేయలేదు అన్నట్లుగా  పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ప్రణాలి తన తప్పును అంగీకరించక తప్పలేదు. ఇటువంటి ఘటనలతోనే  


మరింత సమాచారం తెలుసుకోండి: