ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోయిన తరువాత, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కాలం తీరిపోయిన పిదప, చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాజధాని అమరావతి ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఈ మధ్య వచ్చిన వరద కారణంగా రాజధాని ప్రక్కనే ఉన్నా కొన్ని ప్రాంతాలు కాస్తా ముంపుకు గురయ్యాయి. తర్వాత బొత్స సత్యనారాయణ అమరావతి సురక్షితమైన రాజధాని కాదని కామెంట్లు చేయడం రాజధాని అమరావతి నుంచి మారిపోతుందని వదంతులు రావడం త్వరత్వరగా జరిగిపోయాయి. జగన్ రాష్ట్రంలో లేని సమయం చూసి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే వరస చెందుతారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ.

రాజధాని ప్రాంతంలో ఉండే రైతులు కన్నా లక్ష్మీనారాయణను ఈ విషయమై కలవగా.... ఆయన, బిజెపి వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో జగన్ దానికి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని జనాలను కన్ఫ్యూషన్ లో పెట్టొద్దని కోరారు. అది కాకుండా వైసిపి కేవలం ఒక వర్గం ప్రజల కోసం పని చేస్తుందని ఆయన విమర్శించారు. అన్ని విభాగాల ప్రజలకు వారు మేలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ల పార్టీ మద్దతుదారులు అనుకూలంగా పాలన సాగిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

కన్నా అంతటితో ఆగకుండా ఎంత మంది రైతులు రాజధాని కోసం వారి భూములను ఇంకా ఎన్నో త్యాగాలు చేశారని దానిని జగన్ విస్మరిస్తే బాగోదు అని అన్నారు. అటు కేంద్రం మరియు
ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టిన అమరావతి రాజధానిగా కొనసాగించ లేక పోతే ప్రజల డబ్బుకి చాలా నష్టం వస్తుందని ఆయన అన్నారు. ఈ విధంగా ఆయన అమరావతి కచ్చితంగా రాజధానిగా కొనసాగాలని రైతులకు మద్దతుగా మాట్లాడాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక రాష్ట్రానికి రాజధాని మార్చాలంటే అందుకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. ఒక్క బొత్స సత్యనారాయణ అన్నాడని ఉన్నఫలంగా అమరావతిని రాజధానిగా ఎలా తీసేస్తారు. కనీసం వైసీపీ నేతల నుండి ఇప్పటివరకు వ్యాఖ్యలు ఏమైనా వచ్చాయా? ముఖ్యమంత్రి వరదలు వచ్చిన తర్వాత రాజధాని విషయంలో ఎలాంటి కమిషన్ అయినా వేశారా? ఇవేమీ పట్టించుకోకుండా ఏదో ప్రజలు వచ్చారని వారి ముందు వైసిపి రాజధాని మార్చేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆయన మాట్లాడడం వెనక అంతరార్థం ఏమిటో లక్ష్మీనారాయణకే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: