వైసీపీ సోష‌ల్ మీడియా విభాగంపై పోలీసుల‌కు జ‌న‌సేన‌ ఫిర్యాదు చేసింది.  జనసేన పార్టీ, పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైనా వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీ వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకి జనసేన పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు  బర్త్‌డే గిఫ్ట్ లు ఇస్తున్నారంటూ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని తెలిపారు.

పార్టీ మీద ఎవరు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడినా చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మాటిచ్చారని తెలిపారు.జనసేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ మాట్లాడుతూ  "కొందరు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద అబాండాలు వేస్తున్నారు.  అధ్యక్షుల వారి సూచన మేరకు కొంత సంయమనం పాటించాం. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇప్పుడు స్థాయిని దాటిపోతున్నాయి. వారు ఎలాంటి ఊహల్లో ఉన్నారో దాన్ని ప్రచారం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.

ప్రజల మధ్యకి వెళ్తున్న పార్టీని మొగ్గలోనే తుంచేయాలన్న దురుద్దేశంతో బర్త్ డే సందర్భంగా రూ. 2 వేల కోట్లు బ్లాక్ మనీని వైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ  అసత్య ప్రచారం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా  అధికారిక పేజీ ద్వారా చేస్తున్న ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాం. ఇక మీదట జనసేన పార్టీ మీద ఇలాంటి దుష్ప్ర‌చారాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది" అని చెప్పారు. జనసేన సీనియర్ నేత క్ రియాజ్, లీగల్ సెల్ కో ఆర్డినేటర్ ప్రతాప్ ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: