భారతదేశానికి వరసగా రెండుసార్లు ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ ఒక్కసారి కూడా డైరెక్ట్ గా లోక్ సభకు ఎంపిక కాలేదు.  ఆయన ప్రధానిగా పనిచేసిన పదేళ్లు రాజ్యసభ నుంచి ఎంపికైన సంగతి తెలిసిందే.  1991 నుంచి 2019 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.  1991 నుంచి ఆయన అస్సాం నుంచి ఎంపికవుతూ వస్తున్నారు.  కానీ, 2019 వ సంవత్సరంలో అస్సాం నుంచి ఎంపిక కావడానికి ఆకాశం లేకపోయింది. 


దీనికి కారణం ఉన్నది.  అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు.  గత ఎన్నికల్లో బీజేపీ అక్కడ విజయం సాధించింది.  దీంతో ఈసారి పార్టీకి అవకాశం లేకుండా పోయింది. అస్సాం నుంచి అవకాశం లేకపోవడంతో.. మన్మోహన్ ను పక్కన పెడతారేమో అనుకున్నారు.  కానీ, మన్మోహన్ సింగ్ ను రాజస్థాన్ నుంచి బరిలోకి దించింది.  రాజస్థాన్ నుంచి మన్మోహన్ సింగ్ బరిలోకి దిగుతున్నారని తెలియడంతో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టలేదు.  


రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడైన మదన్ లాల్ షైనీ అకాల మరణంతో... ఆ స్థానానికి ఖాళి ఏర్పడింది.  ఈ స్థానానికి మొదట బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంది.  కానీ, మన్మోహన్ సింగ్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని తెలిసిన వెంటనే... బీజేపీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు.  మన్మోహన్ కు అవకాశం కల్పించింది.  మన్మోహన్ పై ఉన్న గౌరవంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.  బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా.. మన్మోహన్ కోసం త్యాగం చేసింది. 


అయితే, మన్మోహన్ కోసం దాన్ని త్యాగం చేసినట్టు కనిపించడం లేదు.. కావాలని బీజేపీ ఇలా చేసిందని.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ సానుభూతిని పొందాలని, ఆ పార్టీ నాయకుల నుంచి మద్దతు లభించాలంటే ఇలా చేయాలని అందుకే బీజేపీ ప్లాన్ గానే ఇలా చేసిందని అంటున్నారు.  కొందరు మాత్రం బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  పెద్దవాళ్లకు బీజేపీ మంచి గౌరవం ఇస్తోందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: