ఏపీలో రెండు రోజుల నుంచి రాజధాని మార్పు గురించి తెగ చర్చ నడుస్తుంది. నిజానికి ఈ చర్చ మీడియా తన టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవటానికి కావొచ్చు. లేదా వైసీపీ మంత్రి బొత్స సత్య నారాయణ చెప్పిన వ్యాఖ్యలు అర్ధమయ్యి ఉండకపోవచ్చు. అయితే ఇదే విషయం మీద వైసీపీ మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ రాజధానిని మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కుండ బద్దలు కొట్టి నట్లు చెప్పారు. అయితే రాజధానిని మారిస్తే టీడీపీ ఎందుకు ఆందోలన చెందుతుందో అర్ధం కావటం లేదని నాని చప్పుకొచ్చారు. రాజధాని పేరుతో వేళా ఎకరాల భూ దండాలు టీడీపీ నేతలు చేశారని .. నాని చెప్పారు. అయితే అమరావతి గురించి గత ఐదేళ్లలో చంద్రబాబు కలర్ ఫుల్ మూవీ చూపించారు.


ఎందుకంటే సినీమాల్లో అన్నీ సెట్టింగ్స్ .. గ్రాఫిక్స్ మాత్రమే ఉంటుంది. నిజంగా ఆ ప్రపంచం అనేది మనకు కనిపించదు. ఇప్పుడు అదే మాదిరిగా తయారైంది. ఏపీ కలలు రాజధాని అమరావతి. గత ఐదేళ్లలో అమరావతి ఇలా ఉందని .. ఒక కొత్త ప్రపంచాన్ని పత్రికల్లో బాబుగారు చూపించారు. పచ్చ మీడియా కూడా అమరావతి గురించి లేనివి .. ఉన్నవి అన్నీ చూపించింది. కానీ ఇప్పుడు రియల్ అమరావతిని చూస్తే అందులో ఏమి లేదు. ఐదారు బిల్డింగ్స్ తప్పితే చెప్పుకోడానికి ఏమి లేకుండా పోయింది. ఐదేళ్లు తన పరిపాలనలో చంద్రబాబు అమరావతి అంటూ ఎన్నెన్నో గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా వార్తల్లో రోజుకో జిమ్మిక్ చేసేవారు.


కానీ ఇప్పుడు వాస్తవానికి అమరావతిలో ఏముందంటే ఏమి లేదు. గట్టిగా వర్షం వస్తే వరదలు మాత్రం వస్తాయి. ఐకానిక్ బ్రిడ్జిలు అని .. సింగపూర్ డిజెన్స్ అని ఐదేళ్లు కాలక్షేపణ చేశారు. మధ్యలోకి రాజమోళిని తీసుకొచ్చారు. ఇన్నీ చేసిన బాబు గారు ఇప్పటి వరకు కనీసం క్యాపిటల్ కోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఉండేటివి .. అన్నీ తాత్కాలికము. తాత్కాలిక అసెంబ్లీ .. తాత్కాలిక హై కోర్ట్. అయితే ఇటువంటి అమరావతిని కట్టిన బాబు అక్కడి నుంచి రాజధానిని మారిస్తే ఊరుకోను అని మీడియాలో తెగ భాదపడిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: