ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ల  ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు. రిజర్వేషన్ ల కోసం ఊహించని స్థాయిలో పోరు తలపెట్టారు. ఆయన చేసిన ఉద్యమ ఫలితమో లేదంటే ఆ సామాజికవర్గంలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ కారణంగానో టీడీపీ ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ లు కల్పించింది. మోదీ సర్కార్ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తే అందులో కాపులకు ఐదు శాతం కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం.



అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ వాటిని రద్దు చేసింది. దీంతో తమ రిజర్వేషన్ ల పై మరోసారి కేంద్రానికి లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం. ఇది కాపు రిజర్వేషన్ ల కథ ముద్రగడ పద్మనాభం ఉద్యమం. రిజర్వేషన్ ల కోసం పోరాడుతూనే ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ముద్రగడ యోచిస్తున్నారట. అయితే ఆయన పొలిటికల్ కెరీర్ క్రాస్ రోడ్ లో ఉంది. ఏ పార్టీలోకి వెళ్లాలని ఆయన అనుచరులతో సంభాషిస్తున్నారట ఏ పార్టీలోకి వెళ్లడం ఎందుకు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తుందట కమలం పార్టీ.



ఈ క్రమంలో ఆగస్టు పదిహేనో తేదిన కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ అయ్యారు ఆర్ ఎస్ సెస్ క్షేత్ర ప్రచార శ్యామ్ కుమార్ ఇద్దరి మధ్య బ్రేక్ ఫస్ట్ మీటింగులో రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. చివరికి కమలం కండువా ఎప్పుడు కప్పుకుంటారని ప్రశ్నించారట శ్యామ్ కుమార్. దీనికి ఆయన ఆచితూచి స్పందించారట. అయితే రిజర్వేషన్లపై కేంద్రం నుంచి ఓ క్లారిటీ వచ్చిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ముద్రగడ చెప్పారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీలోకి రావాలని టిడిపి ఎమ్మెల్యేలు ఆహ్వానించారట.అయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.



కాపుల రిజర్వేషన్ లను జగన్ సర్కారు రద్దు చేయడంతో వైసీపీ పట్ల ముద్రగడ విముఖతతో ఉన్నారు. బిజెపి నాయకులు ప్రత్యేకించి కృష్ణంరాజుతో ఆయనకు మంచి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందంటున్నాయి పొలిటికల్ వర్గాలు. పార్టీలోకొచ్చే నాయకులకు వెల్కమ్ సాంగ్ పాడుతుంది కమలం పార్టీ. దీంతో ముద్రగడ కూడా బీజేపీలోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: