తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం వివాదం కొత్త పుంతలు తొక్కుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్దానికి దారి తీస్తోంది. ఈ క్రమంలో కొత్త కొత్త డైలాగులు పుట్టుకొస్తున్నాయి. ఈ అంశంపై టీడీపీ నాయకుడు.. టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ మరో కొత్త స్లోగన్ కు ప్రాణం పోశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఉద్దేశిస్తూ ట్విట్టర్‌లో ఘాటు విమర్శలు చేశారు.


వై.. వైషమ్యాలు

కా.. కార్పణ్యాలు

పా.. పాపాలు.


కులం,మతం,ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర మీ దొంగబ్బాయ్ ది టీటీడీ ఛైర్మెన్ గారు. దొంగ పని చేసి దొరికిపోయినా మీదే పై చేయి అంటే ఎలా? తప్పు మీరు చేసి నెపం పక్కవాళ్లపై తోసేసే సంస్కృతి మీది. మీరు చేసిన పాపాలకు తెలుగుదేశం పార్టీ కారణం అనే చేతకాని మాటలు ఇప్పటికైనా ఆపండి. టిడిపి హయాంలో టెండర్ ఇచ్చారు అంటున్నారు.. టెండర్ లో వైకాపా ప్రభుత్వం తిరుమల సన్నిధిలో అన్యమత ప్రచారం చెయ్యాలి అని ఉందా వైవీ గారు ? అంటూ ట్వీట్ చేశారు ఏవీ రమణ. గతంలోనూ వైవీ సుబ్బారెడ్డి ని ఛైర్మన్ గా నియమించిన సమయంలోనూ ఏవీ రమణ విమర్శలు చేశారు.


అయితే... తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ సోషల్ మీడియాలోనూ.. ప్రధాన మీడియాలోనూ వస్తున్న కథనాలను ఏపీ సర్కారు ఖండించింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారంటూ జరుగుతున్న వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆ టిక్కెట్లు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్టుగా తేలిందని.. ఎన్నికలకు ముందు ఆ టెండర్లను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టుగా వెల్లడవుతోందని ఆయన మీడియాకు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: