ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు తీవ్ర  గుండెపోటు వచ్చింది . ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు . కోడెల శివప్రసాద్ అయన కుటుంబ సభ్యులపై ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెల్సిందే  . కొడుకు , కూతురు పై పలు కేసులు కూడా నమోదయ్యాయి . ఇక  అసెంబ్లీ సామాగ్రిని దాచిపెట్టిన వ్యవహారం వెలుగులోకి రావడం తో , శివప్రసాదరావు తీరు పై  అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పిస్తున్నారు .


ఈ నేపధ్యం లో ఈరోజు గౌతమ్ షోరూమ్ దగ్గర హైడ్రామా నెలకొంది . గౌతమ్ షోరూమ్ తనిఖీల కోసం వచ్చిన  అసెంబ్లీ అధికారులను  కోడెల న్యాయవాది  అడ్డుకున్నారు .  ఏ హోదాతో  తనిఖీలు చేస్తారంటూ అయన అసెంబ్లీ అధికారులను ప్రశ్నించారు . అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాల మేరకు గౌతమ్ షోరూమ్ లో తనిఖీలు చేపడుతామని అసిస్టెంట్ సెక్రటరీ రాజ్ కుమార్ తెలిపారు . ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి  లేఖను కోడెల న్యాయవాదికి, రాజ్  కుమార్ చూపించడం తో,  ఆ లేఖ లో  గౌతమ్  షోరూమ్ ప్రస్తావన లేదంటూ తనిఖీలు చేపట్టరాదని  కోడెల  న్యాయవాది అభ్యంతరాన్ని వ్యక్తం  చేశారు .


లిఖితపూర్వకంగా షో రూమ్ పేరు  లేకపోవడం వల్ల తనిఖీలు చేపట్టడానికి  వీల్లేదని న్యాయవాది స్పష్టం చేశారు . ఉదయం నుంచి చోటు చేసుకున్న సంఘటనలతో తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల శివ ప్రసాద్ రావు గుండె పోటుకు గురయినట్లు తెలుస్తోంది .  అయితే అసెంబ్లీ సామాగ్రి వ్యవహారం లో ఎప్పుడైనా వచ్చి తనిఖీలు చేసుకోవచ్చని  కోడెల ప్రకటించగా , నేడు తనిఖీల కు వెళ్లిన అసెంబ్లీ సిబ్బంది ని ఆయన న్యాయవాది అడ్డుకోవడం విమర్శలకు తావునిచ్చింది .

..


మరింత సమాచారం తెలుసుకోండి: