Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 8:41 pm IST

Menu &Sections

Search

చంద్రబాబు తీరు పట్ల తమ్ముళ్ల విస్మయం

చంద్రబాబు తీరు పట్ల తమ్ముళ్ల  విస్మయం
చంద్రబాబు తీరు పట్ల తమ్ముళ్ల విస్మయం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరిపై తెలుగు తమ్ముళ్లు  గుర్రుగా ఉన్నారు. వైకాపా  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన సీనియర్ నేతలకు చెందిన బహుళ  అంతస్తు భవనాలను,  అతిథి గృహాలను అక్రమ నిర్మాణాలు గా గుర్తించి నోటీసులు జారీ చేసి  కూల్చివేస్తున్నా,   చంద్రబాబు కనీసం స్పందించకపోవడం పట్ల వారు అగ్రహావేశం తో  రగిలిపోతున్నారు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  వైకాపా ఏకపక్ష విజయం సాధించి , అధికారం లోకి రావడం తో జగన్ సర్కార్ పనితీరు ను  కనీసం ఆరు నెలలైన పరిశీలించిన తరువాత  విమర్శల దాడి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం తొలుత  భావించింది.


 అయితే ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి  దూకుడుగా వ్యవహరిస్తూ , గత తమ ప్రభుత్వ పాలనపై ఆరోపణలు గుప్పిస్తూ తమని ఇరకాటం లోకి నెట్టే ప్రయత్నాన్ని చేయడం తో టీడీపీ నాయకత్వం   తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది.  కృష్ణా నది వరదలు,  విద్యుత్ పీపీఏ లు,  పోలవరం  కాంట్రాక్టు రద్దు ఇతర సమస్యలేమైనా చంద్రబాబు,  వైకాపా ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తూ  విరుచుకు పడుతున్నారు . అయితే  రాష్ట్రంలో  సొంత పార్టీ నేతలను వైకాపా ప్రభుత్వం టార్గెట్ చేస్తుంటే మాత్రం స్పందించడం లేదని తమ్ముళ్లు ఒకింత విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


 విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు   చెందిన  అపార్ట్మెంట్ కు నోటీసులిచ్చి  కూల్చివేతలు దిగిన అధికారులు,  తాజాగా విశాఖ నార్త్  ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెందిన గెస్ట్ హౌస్  కూల్చివేతకు రెడీ అయ్యారు .  అయినా ఈ సంఘటనలపై  పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కడ కూడా  స్పందించకపోవడం పట్ల తెలుగు తమ్ముళ్లలో  నిరాశానిస్పృహలు వ్యక్తమవుతున్నాయి.  కోట్ల రూపాయలు వెచ్చించి కట్టుకున్న తమ  కట్టడాలను కూల్చివేస్తున్న చంద్రబాబు ఎలాంటి ప్రకటనలు చేయకుండా మౌనం వహించడం ఏమిటో తమకు అంతు చిక్కడం లేదని  టిడిపి నేతలు మండిపడుతున్నారు.


cbn,-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లింగమనేని గెస్ట్ హౌస్ కూల్చివేత ఖాయం : ఇప్పుడిక బాబు ఎం చేస్తారో ?
ప్రాణాలు తీస్తోన్న టిక్ టాక్ సరదా ...
పోలవరం ప్రాజెక్ట్ పనులకు ఒకే ఒక బిడ్ : ఆ సంస్థకే పనుల అప్పగింత ?
నిరుద్యోగుల్లో అనుమానం కలిగించడమే ఆ పత్రిక లక్ష్యం
హవ్వ ... అదేమిటి రామ్ చరణ్ ? అంత పని చేశావా ??
వారం రోజుల్లో ఖాళీ చేయాల్సిందే .. లేకుంటే తదుపరి చర్యలు
బీజేపీ లో ఆది చేరిక ను అడ్డుకుంటున్నది ఆయనేనా ?
అనవసర విషయం లో జోక్యం .. అభాసుపాలయిన ఎంపీ
వైకాపా వల్లే కోడెల శివరాం కు పార్టీ లో కీలక పదవి ...?
ఒంటరి అవుతోన్న చంద్రబాబు ...?
రేవంత్ అత్యుత్సాహం ... మళ్ళీ బహిర్గతమైన కాంగ్రెస్ కుమ్ములాటలు
44 లక్షల ఎకరాలకు సాగు నీరు ఎలా ఇస్తావో చెప్పు కేసీఆర్
మరోసారి అపరేషన్ ఆకర్ష్ ... టార్గెట్ ఆ ఇద్దరు ఎమ్మెల్యే లేనా ?
కనుపాపే ఆ చిన్నారిని కాటేసింది ...
చేతబడి చేశాడంటూ యువకుడి సజీవ దహనం
వైకాపా లో చేరినా తోట త్రిమూర్తులు తనకు శత్రువే ...
కేసీఆర్ సర్కార్ కు వరుసగా కోర్టు మొట్టికాయలు
విజయ్ దేవరకొండ తో అధికార టీఆరెస్ మాట్లాడిస్తోందా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.