దేశ ఆర్దీక వ్యవస్ద గురించి నిన్న జరిగిన చర్చల్లో పాలొగొన్న నీతి అయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ దేశ ఆర్థిక వృద్ధిరేటు గత అయిదేళ్లలో దారుణమైన స్థితిని ఎదుర్కొంటున్నది మీడియాతో అన్నారు.పలు చర్చాంశనీయమైన విషయాలు వెల్లడిస్తూ,దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందనిగత డెబ్బయ్యేళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందని ఆయన అన్నారు.ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించు కుంది. దేశ ఆర్థిక వ్యవస్థ గత డెబ్బయ్యేళ్లలో ఎన్నడూ ఎరుగనంతటి తీవ్ర సంక్షోభాన్ని,ద్రవ్యపరంగా గడ్డుపరిస్థితిని నేడు ఎదుర్కొంటున్నది,ప్రస్తుతం ఎవరూ ఎవరినీ విశ్వసించే స్థితిలో లేరు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన సమయంలో తగు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.



ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూపు కంపెనీల దివాళాతో ఫైనాన్స్‌ రంగంలో తలెత్తిన ఒత్తిడిని నివారించేందుకు ప్రభుత్వం,రిజర్వు బ్యాంకు కలిసి పలు చర్యలు చేపట్టాయన్నారు.ఆర్థిక వ్యవస్ధలో లిక్విడిటిని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా రిజర్వు బ్యాంకు గత కొన్ని నెలల్లో పలు చర్యలు తీసుకున్నదని,దాని ఫలితంగా వ్యవస్థలో నగదు లభ్యత స్థిరంగా ఉందన్నారు.నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌ఎఫ్‌బిసి)లకు ప్రభుత్వ రంగ బ్యాంకులు లిక్విడిటిని సమకూరుస్తున్నాయన్నారు. రిజర్వు బ్యాంకు ఈ ఏడాది రెపో రేటును నాలుగు సార్లు తగ్గించిందన్నారు.ఈ రేటు తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు  అందించాలని బ్యాంకులను ఆదేశించిందన్నారు.



ఎన్‌బిఎఫ్‌సి రంగంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదన్నారు.ఆర్థికంగా నిలదొక్కుకున్న ఎన్‌బిఎఫ్‌సిల అత్యధిక రేటుకు ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులను అనుమతి చ్చిందని ఇందుకోసం ప్రభుత్వం 10 శాతం వరకు నష్టానికి పిఎస్‌బిలకు ఆరునెలల కాలానికి గాను పాక్షిక రుణాలను సమకూ ర్చిందని చెప్పారు.అంతకుముందు ఈ నెలారంభంలో ఆర్థికంగా నిలదొక్కుకున్న ఎన్‌బిఎఫ్‌సి అత్యధిక రేటు ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనుగోలు చేసేందుకు రూపొందించిన రూ.లక్ష కోట్ల పాక్షిక హామీ పథకం నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసిందని ఆయన తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: