మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరద ముప్పు లేదని ఈ విషయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ చెప్పిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సృష్టించిన విపత్తు కృష్ణా వరదలని చంద్రబాబు అన్నారు. కృష్ణా నది వరదల వలన రాజధాని మునిగిపోతుందని వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, వరదల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అన్నారు. 
 
ప్రకాశం బ్యారేజీ సామర్థ్యానికి మించి నిల్వ చేయటం వలన తన ఇంటిని ముంచేయాలని ప్రయత్నం చేసారు. ప్రకాశం బ్యారేజీ నుండి ఒకేసారి నీటిని వదలటం వలన 4 వేల కోట్ల రుపాయల వరకు నష్టం జరిగిందని గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని తీర ప్రాంతాలు, లంక గ్రామాలను వరదలు ముంచెత్తాయని రైతులకు వరదలు భారీగా నష్టం చేసాయని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం కావాలని పోలవరం, అమరావతిని నాశనం చేసిందని చంద్రబాబు అన్నారు. 
 
అమరావతికి వరద ముప్పు ఉందని , ఖర్చు చేయబోమని ప్రభుత్వం అంటుందని చంద్రబాబు అన్నారు. నెల్లూరు, రాయలసీమలోని జలాశయాలు అన్నీ ఖాళీగా ఉన్నాయని వాటిని నింపే ఆలోచన ప్రభుత్వానికి లేదని చందబాబు అన్నారు. వరద బాధితులకు భోజనం పెట్టటానికి ఆధార్ నంబర్ అడిగారని ఈ విషయాన్ని బట్టే ప్రభుత్వ నిర్వాకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై చట్ట ప్రకారం ఏ చర్యలైనా తీసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. 
 
గతంతో పోలిస్తే హైదరాబాద్ లో భూముల విలువ 30 శాతం పెరిగిందని అమరావతిలో స్తిరాస్థి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినవారు మాత్రం దివాళా తీసారని చంద్రబాబు అన్నారు. అమరావతిలోకి భవిష్యత్తులో కూడా వరద నీరు రాదని కరకట్టను బలోపేతం చేస్తే వరద సమస్యే ఉండదని చంద్రబాబు అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: