మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ పేరు ఈ మధ్య వార్తల్లో చాలా ఎక్కువగా నానుతున్న పేరు ఏ మీడియాలో చూసిన,ఏ పేపర్‌ల్లో చూసిన ఇతని వార్తలే,ఆ వార్తలు చదివి,చదివి శివప్రసాద్ గారికి విసుగొచ్చినట్లుందట,అందరు చేస్తున్న వాఖ్యలపై ఆందోళన చెంది చెంది,తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కోడెల.నిన్న రాత్రి ఆయన నివాసంలో శివప్రసాద్ కుప్పకూలడంతో,కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం డాక్టర్లు కోడెలకు చికిత్స అందిస్తున్నారు.ఆయన తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.శివ ప్రసాదరావుకు అస్వస్థతని తెలియడంతో టీడీపీ నేతలు,కార్యకర్తలు ఆస్పత్రి దగ్గరకు చేరుకుంటున్నారు.



కొద్ది రోజులుగా కోడెల కుటుంబం పలు వివాదాల్లో చిక్కుకుంది అన్న సంగతి తెలిసిందే.శివప్రసాదరావు కుమారుడితో పాటూ కుమార్తెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.హైదరాబాద్‌లో అసెంబ్లీ నుంచి అమరావతికి తరలించాల్సిన సామగ్రిని తన సొంత ఇంటికి,తన కుమారుడి షోరూమ్‌కి తరలించారని ఆరోపణలు వచ్చాయి.వాటిని ఆయన కూడా అంగీకరించారు.ఆఫీసులో స్థలం లేకపోవడం వల్ల తన వద్ద భద్రపరిచానని, కావాలంటే తీసుకుని వెళ్లొచ్చనికూడా చెప్పారు.ఓ స్పీకర్‌గా పనిచేసిన ఆయన ఇలా కుర్చీలు,బెంచీలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ ఇంటికి తీసుకుని వెళ్లడం రాజకీయాల్లో పెనుదుమారానికి దారితీసింది.కోడెల చేసిన పని తప్పు అంటూ ఆ పార్టీ నేతలు కూడా స్పష్టం చేశారు.ఈ క్రమంలో నిన్న రాత్రి కోడెల నివాసంలోకి కొందరు యువకులు చొరబడి కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు.ఈ రెండు వ్యవహారాలపై విచారణ కొనసాగుతోంది.వరుసగా ఆరోపణలతో సతమతమవుతున్న కోడెల తీవ్ర ఒత్తిడితో ఉన్నట్లు తెలుస్తోంది.



ఇక ఓదశలో ఆయన ఆరోగ్య పరిస్దితి దృష్ట్యా  కోడెలను గుంటూరు నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించాలని భావించారు.,కాని ఇక్కడికే నిపుణులైన వైద్యులు వచ్చారు.దీంతో ట్రీట్‌మెంట్‌ను బట్టి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు డాక్టర్స్.అయితే గతంలో కోడెల శివప్రసాదరావుకు ఓ సారి గుండెపోటు వస్తే.అప్పుడు చికిత్స చేసిన వైద్యులు స్టెంట్ అమర్చారు.కోడెలకు హార్ట్ ఎటాక్ రావడం ఇది రెండోసారి.ఇకపోతే కోడెలకు హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నేతలు,ఆయన అనుచరులు ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు.కోడెల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి: