చిదంబరంపై పాక్ కు ఎందుకంటే ప్రేమో అర్ధం కావడం లేదు.  చిదంబరాన్ని ఐనాక్స్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది అని తెలియగానే అందరికంటే ముందు పాపం పాక్ గగ్గోలు పెట్టింది.  చిదంబరాన్ని కావాలని కేసులో ఇరికించారని, ఆయనకు ఏ పాపం తెలియదని చెప్పి వాపోతున్నారు.  అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది తెలియడం లేదు. 


చిదంబరం పాకిస్తాన్ కోసం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేసారా అనే డౌట్ వస్తున్నది.  హోమ్ శాఖా మంత్రిగా, ఆర్ధిక మంత్రిగా అయన పనిచేశారు.  ఆ సమయంలో పాకిస్తాన్ కు ఉపయోగపడే నిర్ణయాలు ఏమైనా తీసుకున్నాడా.. లేదంటే ఆ దేశంలోని ఉగ్రవాదులు మనదేశంలోకి చొరబడే సమయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సైలెంట్ గా ఉన్నారా.. అలా ఉంటేనే కదా ఇప్పుడు ఆ దేశం సమర్థిస్తుండేది.  


అలా కాకుండా అయన హోమ్ మంత్రిగా ఉన్న సమయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఉంటె ఇప్పుడు అయన గురించి పాకిస్తాన్ ఎందుకు మాట్లాడవుతోంది.. దీని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అన్నది తెలియాలి.  పైగా చిదంబరం గురించి పాకిస్తాన్ చేసిన జోస్యం ఆలోచింపజేస్తోంది.  తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, చిదంబరం ప్రధాని అవుతారని చెప్పి జోస్యం చెప్పింది పాకిస్తాన్.  


ఇండియా రాజకీయాల్లో పాకిస్తాన్ జోక్యం ఎందుకు అర్ధం కానీ విషయం.  జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తరువాత కాశ్మీరీ ప్రజల కంటే కూడా పాపం పాకిస్తాన్ ఎక్కువగా బాధపడుతున్నది.  కారణం ఏంటి అన్నది తెలిసిందే.  అరాచకాలు సృష్టించడానికి తగిన వాతావరణం దొరకడం లేదు.  ఇండియాను అస్థిరపరచలేకపోతున్నది.  అందుకే ఇలాంటి వాదనలు చేస్తోంది.  ఈ వాదనల వలన పాకిస్తాన్ కు ఎలాంటి లాభం ఉన్నదో తెలియదుగాని ఇండియాకు మాత్రం ఆవగింజంతైనా నష్టం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: