మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత ఉంది. అదే.. రామాయ‌ణంలో పిడ‌క‌ల వేట‌! ఏదైనా విష‌యం గురించిన చ‌ర్చ వ‌చ్చినప్పుడు.. దానిలోని లోతుపాతుల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా.. వేరే వేరే విష‌యాల‌ను ఆపాదిస్తూ.. త‌న కు ల‌బ్ధి చేకూరేలా వ్య‌వ‌హ‌రించేవారినే రామాయ‌ణంలో పిడ‌క‌ల వేట సాగిస్తున్నార‌ని అంటారు. అచ్చు ఇ ప్పుడు ఈ ప‌నే చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. తాను ఎక్క‌డికి వెళ్లినా.. అక్క‌డి విష‌యాల‌ను మానే సి.. ఇది ప్ర‌జ‌లు కోరితెచ్చుకున్న శ‌ని అంటూ .. వైసీపీ అదినేత జ‌గ‌న్‌, ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గు ప్పిస్తున్నారు. 


దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు సోష‌ల్ మీడియాలో సెంట‌రాఫ్‌ది టాపిక్‌గా మారిపోయారు. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల వ‌ర‌ద‌లు వ‌చ్చిన ప్రాంతాల్లో క‌లియ‌దిరిగారు చంద్ర‌బాబు. అయితే, ఆయ‌న వ‌ర‌ద బాధితుల‌ను ఓదార్చ‌డం మానేసి.. త‌న ప్ర‌భుత్వ పాల‌న విష‌యాన్ని ఏక‌రువు పెట్టారు. అదే స‌మయంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న ఇంటిని ముంచ‌డం కోసం.. ప్ర‌జ‌ల ఇళ్ల‌ను ముంచేసింద‌ని చెప్పారు. వాస్త వానికి చంద్ర‌బాబు ఇంటిని ముంచాల‌ని అనుకుంటే.. అధికారులు చూస్తూ.. ఊరుకుంటారా? గ‌తంలో కూడా జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారుల‌కుస్వ‌తంత్ర అధికారాలు కొన్ని ఉన్నాయ‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పారు.


మ‌రి ఇప్పుడు ఆయ‌న ఎదురు దాడి చేస్తున్నారు. అవ‌స‌ర‌మైన మేర‌కు అవ‌సర‌మైనంత నీటిని కిందికి విడుద‌ల చేశారు. కానీ, చంద్ర‌బాబు మాత్రంయాగీ మాన‌లేదు. ఇక‌, పోల‌వ‌రం విష‌యంపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనినే న‌వ యుగ కంపెనీకి అనుకూలంగా మాట్లాడింద‌నే అర్ధంలో చంద్ర‌బాబు అర్ధం చేసుకున్నారు. అంతేకాదు, జ‌గ‌న్‌కు ఇది చెంప‌దెబ్బ‌.. అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు కూడా చేశారు. 


వాస్త‌వానికి ఇక్క‌డ జ‌రిగింది వేరు. తాము పొందిన ఒప్పందాన్ని ర‌ద్దు చేసే అధికారం ప్ర‌భుత్వానికి లేద‌ని న‌వ‌యుగ కంపెనీ పేర్కొంది. అదే సమ యంలో జ‌ల విద్యుత్ ప్రాజెక్టుకు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ వ్య‌వ‌హారం.. మిగిలిన వాటికి కూడా జోడిస్తూ.. చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు ఓట‌మి త‌ర్వాత ఏరుకుంటున్న బీకాంప్లెక్స్ టాబ్లెట్ల మాదిరిగానే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: