ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృధ్ధి సంస్థ వందకు పైగా రేవులను గుర్తించి ఇసుక తవ్వడానికి, నిల్వ కేంద్రాలకు తరలించటానికి మరియు నిల్వ కేంద్రాల నుండి రవాణా చేయటానికి టెండర్లను పిలిచింది. ఈ టెండర్లలో గుత్తేదారులు కోట్ చేసిన రేటు చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తుంది. చాలామంది గుత్తేదారులు వారికి ఏ మాత్రం గిట్టుబాటు కాని ధరలను టెండర్లలో కోట్ చేసారు. ఆ ధరకు టెండర్లు ఇస్తే గుత్తేదారులు భారీగా నష్టపోతారు అయినప్పటికీ అంత తక్కువ మొత్తానికి ఎందుకు టెండర్లు వేసారనే ప్రశ్నతో అధికారులే ఆశ్చర్యపోతున్నారు. 
 
రాష్ట్రంలో ఇసుక తవ్వడం, నిల్వ కేంద్రాలకు ఇసుకను తరలించటానికి 46 మంది గుత్తేదారులు టెండర్లు వేసారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక గుత్తేదారు కేవలం 15 రుపాయలకు టెండర్ కోట్ చేసాడు. శ్రీకాకుళం జిల్లాలోని ఒక గుత్తేదారు మాత్రం 299 రుపాయలకు టెండర్ కోట్ చేసాడు. అధికారులు సగటు ధరను 100 రుపాయల నుండి 105 రుపాయల మధ్య నిర్ణయించారు. 100 రుపాయల కంటే ఎక్కువ ధరకు టెండర్ కోట్ చేసినవారిని పిలవబోతున్నారు. 
 
నిల్వ కేంద్రాల నుండి ఇసుక రవాణా చేయటంలో కూడా ఆశ్చర్యపోవటం అధికారుల వంతయింది. టన్ను ఇసుక రవాణా చేయటానికి కిలో మీటర్ కు రుపాయి తొంభై పైసలు ఇస్తే చాలని గుంటూరు జిల్లాలో టెండరు వేసినట్లు తెలుస్తుంది. అనంతపురం జిల్లాలో 8 రుపాయల 40 పైసలకు కిలో మీటర్ కు ఇవ్వాలని అత్యధిక ధరతో టెండర్ వేసినట్లు తెలుస్తుంది. 4 రుపాయల కంటే ఎక్కువ ధరకు కోట్ చేసిన వారిని పిలవనున్నారని తెలుస్తుంది. 
 
ఇసుకను నిల్వ కేంద్రాల నుండి రవాణా చేయటానికి 10 కిలో మీటర్ల దూరానికి 350 రుపాయల ఖర్చు అవుతుంది. కానీ టెండర్లో కోట్ చేసిన రుపాయి 90 పైసలు చెల్లిస్తే గుత్తేదారుకు 210 రుపాయలు మాత్రమే వస్తాయి. అంత తక్కువ ధరకు నష్టాలు వస్తాయని తెలిసినా గుత్తేదారులు అంత తక్కువ ధరకు ఎందుకు కోట్ చేసారో అధికారులకు అర్థం కావటం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: