అన్నా క్యాంటీన్లు ఎత్తివేశారని పసుపు తమ్ముళ్ళు ఓ వైపు గగ్గోలు పెడుతున్నరు. అయితే అన్నా క్యాంటీన్ల వెనక పెదవాడి అన్నం ముద్ద పెట్టే వ్యవహారాన్ని పక్కన పెడితే అవినీతి ఏ స్థాయిలో సాగిందో కూడా వెలుగు చూస్తున్న కధలు షాక్ కలిగిస్తున్నాయి. అన్నా క్యాంటీన్ల మీద అంత పట్టుపడుతున్న టీడీపీ తమ హయాంలో  విచ్చలవిడిగా చేసిన అవినీతి మీద ఏం సమాధానం చెబుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.


ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే అన్న క్యాంటీన్ల నిర్మాణంలో ఏకంగా 4 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా లెక్కలు తేలాయి. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతి రాజ్  ప్రధాన కార్యదర్శి ఎడ్ల తాతాజీ చెబుతున్న వివరాలు చూస్తే అన్నా క్యాంటీన్లకు కూడా అవినీతి జలగలు అసలు వదలలేదని అర్ధమవుతోంది. అన్న క్యాంటీన్లకు ఇష్టం వచ్చినట్లుగా డబ్బు ఖర్చు చేసి తమ్ముళ్ళు బాగు పడ్డ కధలు తాతాజీ చెప్పిన దాని ప్రకారం అర్ధమవుతోంది.


అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం చేసిన ఖర్చు చూస్తే దిమ్మ తిరగాల్సిందే. చదరపు అడుగుకు ఏకంగా 5532 రూపాయలు  ఖర్చు చేసిందంటేనే ఏ స్థాయిలో అవినీతి జరిగిందన్నది తెలిసిపోతోంది. అన్నా క్యాంటీన్లకు స్థలం ప్రభుత్వానిది, కొన్ని చోట్ల మునిసిపాలిటీది, మరి స్థలం ప్రభుత్వానిది అయినపుడు కేవలం 1500 రూపాయలు వంతున చదరపు అడుగులకు ఖర్చు చేయవచ్చును. కానీ దాని నాలుగైదు రెట్లు ఖర్చు చేసి అన్నా క్యాంటీన్లను నిర్మించారంటేనే అంతులేని అవినీతి కధ తెలిసిపోతోందని అంటున్నారు.


ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నా క్యాంటీన్ల నిర్మాణంలో 30 లక్షల వరకూ  అవినీతి చోటు చేసుకుందని తాతాజీ వివరాలతో సహా జగన్ కి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇక్కడ 16 అన్నా క్యాంటీన్లు కట్టారు. ఈ లెక్కన నాలుగు కోట్ల 80 లక్షల మేర అవినీతి జరిగిందని కూడా ఆయన వివరించారు.


అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం 36 లక్షలు ఇస్తే, లోకల్ గా ఉన్న మునిసిపాలిటీలు 6 లక్షలు ఇచ్చాయి. ఇలా 42 లక్షలలో 30 లక్షలు  అవినీతి జరిగిందంటే ఇది పెద్ద స్కాం అంటున్నారు. మిగిలిన  పన్నెండు  జిల్లాలను కూడా  తీసుకుంటే ఎన్ని కోట్ల అవినీతి జరిగిందన్నది లెక్క చెబుతామని తాతాజీ అంటునారంటే అన్నా క్యాంటీన్లలో  పేదోడి ముద్దను ఎవరు లాగేశారో అర్ధమవుతోంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: