Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 11:24 pm IST

Menu &Sections

Search

ఇంకో ప్రాజెక్టుపై కేసీఆర్ ఫోక‌స్‌...మూడు షిఫ్టులు చేయాల‌ని ఆర్డ‌ర్‌

ఇంకో ప్రాజెక్టుపై కేసీఆర్ ఫోక‌స్‌...మూడు షిఫ్టులు చేయాల‌ని ఆర్డ‌ర్‌
ఇంకో ప్రాజెక్టుపై కేసీఆర్ ఫోక‌స్‌...మూడు షిఫ్టులు చేయాల‌ని ఆర్డ‌ర్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మ‌రో ప్రాజెక్టుపై  ఫోక‌స్ పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును శ‌ర‌వేగంగా పూర్తయ్యే స్థితికి తెచ్చిన‌ట్లే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయడంద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు అందుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. మిగతా సగానికి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంద్వారా నీరివ్వాలని అన్నారు. 


వచ్చే వర్షాకాలంలో పంటపొలాలకు నీరందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే రేయింబవళ్లు, మూడుషిప్టుల్లో పనిచేసి ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న, భవిష్యత్తులో జరుగాల్సిన పనులపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, కాల్వల పనులను సమాంతరంగా చేపట్టాలని చెప్పారు. సీనియర్‌ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రపర్యటన జరిపి, పనుల్లో వేగం పెంచాలని కోరారు.

ఇదిలాఉండ‌గా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని పలు ప్యాకేజీల సొరంగం పనుల పర్యవేక్షణ, రాతి నిర్మాణా ల నిర్వహణతో పాటు సొరంగం, మట్టిపొరల పరిశోధనను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ రాక్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌ఎం) కొన‌సాగిస్తోంది. ఏడాదిపాటు పరిశోధన బాధ్యతలు ఎన్‌ఐఆర్‌ఎం నిర్వహించేలా ప్ర‌భుత్వం గత మార్చిలో బాధ్య‌త‌లు అప్పగించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపరిధిలోని ప్యాకేజీ నంబర్ 1,5,8,16లలో సొరంగం పనులు చేపట్టా రు. ఇక్కడ భూమి, మట్టిపొరల పరిశోధన అవసరమని సీఎం కేసీఆర్ గతంలో నిర్వహించిన సర్వేలో ఆదేశించారు. కాళేశ్వరం తరహాలోనే ఈ ప్రాజెక్టులో కూడా పరిశోధనలుచేయాలని సీఎం ఇంజినీర్లకు సూచించారు. దీంతో ఎన్‌ఐఆర్‌ఎం ఏజెన్సీకి పరిశోధన బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల తాగునీరు అందిస్తారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెకుకు దాదాపు 50వేల ఎకరాల భూమిని సేక‌రించారు. 

kcr-kaleswaram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెప్టెంబ‌ర్ 17 ర‌చ్చ‌..కేసీఆర్ ఓ రేంజ్‌లో క్లారిటీ ఇచ్చాడుగా
ప్ర‌పంచం మొత్తం భార‌త్ వెంటే..పాక్ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కొత్త వివాదం సృష్టించిన అమిత్ షా..భ‌గ్గుమంటున్న దేశం
యురేనియం తవ్వ‌కాలు..పెద్ద భారం త‌గ్గించుకున్న కేసీఆర్‌
స‌త్య నాదెళ్ల ఇంట తీవ్ర విషాదం
పీఓకేను స్వాధీనం చేసుకోనున్న భార‌త్‌...ఎప్పుడంటే...
షాకింగ్ఃమ‌గ‌జాతి అంత‌రించిపోతుంద‌ట‌.
హిందూ..ముస్లిం వివాహం...సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్‌తో బీజేపీని ఎలా టార్గెట్ చేశారంటే
బుద్ధి పోనిచ్చుకోని చైనా...భార‌త్ ఘాటు జ‌వాబుతో...
క‌విత‌కు ఒకే రోజు రెండు షాకులు...ఓట‌మి కంటే భారీ దెబ్బ‌
ఇందుకే..హ‌రీశ్ రావు అంద‌రి హృద‌యాల్లో నిలుస్తాడు
ఐఫోన్ కొంటున్నారా...ఈ విష‌యం తెలియ‌క‌పోతే...జేబు ఖాళీయే
కొత్త వాహ‌నాల ఫైన్లు....కేంద్ర రాష్ట్ర స‌ర్కారుల మ‌ధ్య కొత్త వివాదం
ఈ మ‌చ్చ‌లేని నేత‌ను కేసీఆర్ ఎందుకు ఏడిపించాడు?
కేసీఆర్‌కు మంట పుట్టించ‌కుండా ఆ మంత్రి ఏం చేశారంటే....
క‌శ్మీరీ యాపిల్స్‌...కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్ ఇదే
చ‌లో ఆత్మకూరుకు బ్రేక్‌...బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
మ‌ళ్లీ కృష్ణ‌మ్మ గ‌ల‌గ‌ల‌....తెలంగాణ ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండ‌లు..
బ్రిట‌న్‌లో చ‌దువు...ఈ కొత్త మార్పులు గ‌మ‌నించాల్సిందే?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.