ఇప్పుడు మనం చదివిన ఈ హెడ్‌లైన్ సినిమా టైటిల్ లాగ వుందనిపిస్తుంది కదూ..ఆ మధ్య వచ్చిన బిచ్చగాడు సినిమా చూసేవుంటారు.అందులో హీరో తన తల్లి ఆరోగ్యంకోసం కోట్లు వదులుకుని బిచ్చమెత్తుకుంటాడు,కాని ఇక్కడ చెప్పే మ్యాటర్లో,పూట గడవని వాడిలా పుట్టి కోట్లకు పడగలెత్తాడు,కాని ఏం సుఖం బ్రతికున్నప్పుడు ఆ డబ్బుతో సుఖపడక రూపాయి రూపాయి పోగేసాడు చివరకు మరణించాడు.ఏం లాభం ఒక్కపైసాకూడా వెంట తీసుకెళ్లలేక పోయాడు.సినిమాల్లో కనిపించే ఇలాంటి సంఘటనలు నిజజీవితంలో అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి.దిక్కులేని వాడికి దివాన లేదు అంటారు అందరు కాని ఇతనికి దిక్కులేదు కాని కావల్సినంత డబ్బుంది.అలాంటిదే ఇప్పుడు మనం చదవబోయే ఈ సంఘటన వివరాల్లోకి వెళ్లితే..



ఓ బిచ్చగాడి దగ్గర రూ.1.86 కోట్లకు పైగా డబ్బు దొరకడంతో స్దానికులతో పాటుగా ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.తమిళనాడులో జరిగిన ఈ సంఘటన అక్కడ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.ఇంతకు ఆ బిచ్చగాడు ఎవరు,ఎక్కడినుండి వచ్చాడు,అనే వివరాలు ఏవి తెలియవు ఇక తమిళనాడులోని అరవన్నామలై ప్రాంతంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భిక్షకుడు మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని,అతని దగ్గర ఉన్న సంచిని పరిశీలించి బిత్తరపోయారు.అందులో పెద్దమొత్తంలో డబ్బుంది.ఆ డబ్బును అక్కడికక్కడే లెక్కించగా,మొత్తం రూ. 1,86,43,364 నగదుగా తేలిందట,కాగా అంత డబ్బున్నప్పటికీ అతను ఇంకా భిక్షాటనే ఎందుకు చేస్తున్నాడన్నది పోలీసులకే కాదు,ఈ సందర్భంను చూసినవారికందరికీ అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోయింది.



ఇంత డబ్బు అతని దగ్గర పెట్టుకుని ఇంతకాలం నుండి బిక్షాటనే ఎందుకు చేస్తున్నాడు,మామూలుగా బెగ్గింగ్ చేసే వాళ్ళదగ్గర వందలు,వేలు,కాకపోతే ఓ లక్ష వుంటాయి కాని ఇతని దగ్గర ఏకంగా కోటి ఎనబై లక్షలు,ఎలా సాధ్యం అనుకోనివారు వుండరు.పుట్టినప్పుడు ఎలా పుట్టాడో తెలియదు కాని పోయేటప్పుడు మాత్రం కోటీశ్వరుడైన అనాధగానే కన్నుమూసాడు.తాను కోటీశ్వరుడన్న విషయం ఇతనికి తెలుసో లేదో మరి.ఇక ఈ అనాధ శవానికి ఓ స్వచ్చంద సంస్ద అంత్యక్రియలు చేయడానికి ముందుకు వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: