అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దొంగతనం కేసు వ్యవహారంలో చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ఎందుకు స్పందించటం లేదు. అయినదానికి కాని దానికి ఇంటి పై కప్పుపైకి ఎక్కి నానా యాగీ చేసే టిడిపి నేతలు కూడా కోడెల వ్యవహారంపై  మాట్లాడటానికి ఇష్టం పడటం లేదు.

 

నిజానికి కోడెల వ్యవహార శైలితోనే కాదు కొడుకు శివరామ కృష్ణ, కూతురు విజయలక్ష్మి అరాచకాలతో టిడిపి పరువు ఎప్పుడో రోడ్డున పడింది. 24 గంటలూ నీతులు చెప్పే కోడెల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంతకాలం కొడుకు, కూతురు చేసిన  అరాచకాలే బయటపడ్డాయి. వాళ్ళపై బాధితులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా సుమారు 20 కేసులు నమోదయ్యాయి. సత్తెనపల్లి, నరసరాపేట నియోజకవర్గాల్లో ఐదేళ్ళు సాగించిన దందాలు, అరాచకాలకు తండ్రికున్న అధికారాలే పెట్టుబడి అన్న విషయం అందరికీ తెలుసు.

 

పిల్లలపై కోడెలకున్న దృతరాష్ట్ర ప్రేమే చిరవకు ఆయన కొంపను కూడా ముంచేసింది. అసెంబ్లీకి చెందిన కోట్లది రూపాయల ఫర్నీచర్ దొంగతనం కేసులో చివరకు కొడుకుతో పాటు కోడెల కూడా పోలీసు కేసును ఎదుర్కొంటున్నారు. ఈరోజో రేపో అరెస్టు కూడా ఖాయమని అనుకుంటున్న సమయంలోనే గుండెనెప్పంటూ మాజీ స్పీకర్ ఆసుపత్రిలో చేరారు.

 

సరే ఈ విషయాన్ని పక్కనపెడితే కోడెల వ్యవహారంతో పార్టీ ఇంతగా గబ్బుపట్టినా చంద్రబాబు, చినబాబు మాత్రం ఎందుకు స్పందించటం లేదు ? అన్నదే ఇపుడు అందరికి అనుమానం వస్తోంది. ఇన్ని రోజులకు వర్ల రామయ్య ఒక్కరే కోడెల వ్యవహారంపై మండిపడ్డారు. అయినదానికి కానిదానికి జగన్ పై బురదచల్లేందుకు ప్రయత్నించే తండ్రి, కొడుకులతో పాటు అచ్చెన్న, బుచ్చయ్య, ప్రత్తిపాటి లాంటి సీనియర్ నేతలెవరూ కోడెల వ్యవహారాలపై మాట్లాడేందుకే ఇష్టపడటంలేదు.

 

సంబంధం లేని వ్యవహారాల్లో జగన్ ను రచ్చకీడ్చటానికి ప్రయత్నిస్తున్నారే కానీ ఆల్రెడీ పార్టీని గబ్బు పట్టించేసిన కోడెల విషయాలపైన మాట్లాడితే ఉన్న పరువు కూడా పోతుందనే భయంతోనే వెనకాడుతున్నారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: