జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి.  జమ్మూలో పరిస్థితులు పూర్తగా అదుపులో ఉండగా, శ్రీనగర్ లో ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి.  మరికొన్ని రోజుల్లోనే అన్ని సర్దుకునే అవకాశం ఉన్నది.  ఇదిలా ఉంటె, జమ్మూ కాశ్మీర్ లో పర్యటించే అవకాశం ఇవ్వాలని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీ కోరింది.  


కాశ్మీర్ లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, లోయలో ఇప్పుడిప్పుడే సద్దు మణుగుతున్నాయని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని, లోయలో పర్యటించాలని సత్యపాల్ సింగ్ కోరడంతో అందుకు రాహుల్ గాంధీ అండ్ కో సిద్ధం అయ్యారు.  ఈరోజు కాశ్మీర్ లోయలో పర్యటించేందుకు ప్రతిపక్షం సిద్ధం అయ్యింది.  అయితే, నిన్నటి రోజున కాశ్మీర్ లో కొన్ని పరిణామాల నేపథ్యంలో తిరిగి ఆంక్షలను విధించాల్సి వచ్చింది.  


ఈ సందర్భంలో రాహుల్ గాంధీ అండ్ కో కాశ్మీర్ లో పర్యటిస్తే.. దానివలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అభిప్రాయ పడింది.  రాహుల్ పర్యటను వాయిదా వేసుకోవాలని కోరింది.  అయితే, ఈ విషయంలో రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియడం లేదు.  ఒకవేళ వాయిదా వేసుకోకుండా లోయలో పర్యటించాలని వస్తే.. అక్కడి పోలీసులు అందుకు అనుమతి ఇస్తారా అన్నది సందేహమే.  


నిన్నటి రోజున శుక్రవారం నమాజ్ తరువాత కొంతమంది అలజడి సృష్టించేందుకు  ప్రయత్నం చేశారు.  దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయక తప్పలేదు.  ప్రస్తుతం అక్కడ నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయి.  ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటించకుండా ఉండటమే మంచిది.  ఒకవేళ వస్తే అది రాజకీయంగా ఇబ్బందులు కలుగజేసినట్టు అవుతుంది.  చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ నేత గులాంనబీ ఆజాద్ లోయలో పర్యటించాలని చూస్తున్నారు.  అదే విధంగా వామపక్షాలు కూడా పర్యటించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాయి.  అక్కడ ఎలాంటి ఉద్రేకపూర్తిమైన వ్యాఖ్యలు చేసినా పరిస్థితులు తిరిగి మొదటికి వస్తాయి.  అందుకే అనుమతి ఇవ్వడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: