గుంటూరు జిల్లాలోని కొల్లూరు ప్రాంతంలో వరద బాధితులు ఆందోళన చేస్తున్నారు. కృష్ణా నది వరద ముంపునకు గురైన బాధితులకు అధికారులు ఇప్పటికే నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వలన వరద ముంపునకు గురైన బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. బాధితులకు అధికారులు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను పంపిణీ చేసారు. కాలపరిమితి ముగిసిన నూనె ప్యాకెట్లను పంపిణీ చేయటంతో వరద బాధితులు ఆందోళనకు దిగారు. 
 
అధికారులు పంపిణీ చేసిన నూనె ప్యాకెట్ల కాల పరిమితి జులై నెలతోనే పూర్తయింది. కానీ అధికారులు వీటిని బాధితులకు పంపిణీ చేసారు. వరదలు వచ్చిన 4 రోజుల తరువాత అధికారులు నిత్యావసర వస్తువులు సహాయం చేసారని బాధితులు చెబుతున్నారు. అధికారులు ఇలాంటి కాలపరిమితి చెందిన ప్యాకెట్లను పంపిణీ చేస్తే ప్రజలు అనారోగ్యానికి గురవుతారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
బాధితులు మీడియాతో మాట్లాడుతూ కాలపరిమితి దాటిన నూనె ప్యాకెట్లను ఇచ్చారని ఈ నూనె ప్యాకెట్లను వాడితే జబ్బులు వస్తాయని, వరదలు వచ్చి ఇప్పటికే చాలా అవస్థలు పడుతున్నామని ఇలాంటి సమయంలో అధికారులు ఇలాంటి కాలం చెల్లిన నూనె పంపిణీ చేస్తే మా పరిస్థితేంటి అని నూనె ఆవిరి అయిపోతుందని ఒక మహిళ తెలిపారు. 
 
మరో మహిళ మాట్లాడుతూ మాకు మంచి నూనె ప్యాకెట్లను ఇవ్వలేదు అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని అన్నారు. మరో మహిళ మాట్లాడుతూ ఇచ్చే వాళ్ళు మంచి సరుకులు ఇస్తే బాగుండేదని ఇలాంటి సరుకులు ఇస్తే ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేసింది.కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను వెనక్కు తీసుకొని కొత్త ప్యాకెట్లను త్వరగా ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారులు ఎవరూ స్పందించలేదని సమాచారం అందుతుంది. కొన్ని చోట్ల మాత్రం సిబ్బంది స్పందించి నూనె ప్యాకెట్లను వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: