వైఎస్ జగన్ అధికారంలోకి వచ్సిన తరువాత యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగానే ఉద్యోగాలను కల్పిస్తున్నారు.  ఆగష్టు 15 వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జగన్ ప్రభుత్వం దాదాపు 2లక్షల 50వేల మందిని వలంటీర్లుగా నియమించింది.  గ్రామంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉంటారు.  ఆ 50 కుటుంబాలకు సంబంధించిన బాధ్యతను అతనే తీసుకోవాలి.  ప్రభుత్వ పధకాలు అమలు జరిగేలా చూడాలి.  


మొత్తం నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం మిగతా రెండున్నర లక్షల ఉద్యోగాల కింద గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను ఇవ్వబోతున్నది.  దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా గతంలో జారీ చేసింది.  మొత్తం లక్షా 26వేల 728 ఉద్యోగాలకు గాను రియాకృడు స్థాయిలో 21.69  లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈరోజు సాయంత్రం 4 గంటలకు దీనికి సంబంధిచిన హాల్ టికెట్స్ ను ఆన్లైన్ ద్వారా జారీ చేస్తున్నారు.  


సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కోసం పరీక్షలు జరగనున్నాయి.  ఇందు కోసం రాష్ట్రంలో 6వేల సెంటర్లను ఏర్పాటు చేశారు.  గ్రామ, వార్డు కేటగిరి పోస్టులను రెండు విభాగాలుగా విభజించారు.  రెండు విభాగాలకు 150 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.  కేటగిరి 1 పోస్టులకు పార్ట్ ఏ 75 మార్కులు, పార్ట్ బి 75 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.  ఇక కేటగిరి 2 పోస్టులకు పార్ట్ ఏ 50 మార్కులు, పార్ట్ బి 100 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది.  


అంతేకాదు, ఇందులో నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి.  ప్రతి నాలుగు తప్పు సమాధానికి ఒక మార్క్ కట్ అవుతుంది.  సో, విద్యార్థులు ప్రశ్నలకు సమాధానం రాసే సమయంలో జాగ్రత్తగా తప్పులు లేకుండా రాయాలి.  అప్పుడే సెలక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.  దీంతో ఉద్యోగం సొంత పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు అనే అపవాదు పోతుంది.  21.69 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు అంటే మాములు విషయం కాదు.  పోటీ భారీగా ఉంటుంది.  సెప్టెంబర్ 5 వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఆ రోజు మినహా మిగతా రోజుల్లో పరీక్షలు జరుగుతాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: