తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు . ఎక్కువ ధర కు విద్యుత్ కొనుగోలు ద్వారా భారీ ఎత్తున  అవినీతి కి పాల్పడ్డారని అన్నారు . అయితే లక్షణ్ అవగాహన లేకనే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని  జెన్‌కో,  ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి  ప్రభాకర్ రావు అన్నారు . విద్యుత్  ఒప్పందాలపై సిట్టింగ్ జడ్జి చేత కానీ ,  సీబీఐ ద్వారా  విచారణకైనా తాము సిద్దమే అని అయన  సవాల్ విసిరారు..తమపై ఎవరి ఒత్తిళ్లు పనిచేయలేదని, విద్యుత్ ఒప్పందాల విషయంలో పారదర్శకంగా  వ్యవహరించామని చెప్పారు .


విద్యుత్ ఒప్పందాలపై ఎవ్వరికైనా ఎటువంటి  అపోహలు ఉన్నా తీర్చేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాత్రీకి రాత్రే పీపీఏలు చేసుకున్నామని చెప్పడం అవాస్తమన్న  ప్రభాకర్ రావు , రాత్రికి రాత్రే  ఎక్కడా  పీపీఏ ఒప్పందాలు జరగవని అన్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతోనే తాము విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని ,  రూ 3.90 పైసలకు ఒప్పందం కుదుర్చున్నామని అన్నారు. ఇక 4.30 పైసలకు ఎన్టీపీసీ విద్యుత్ సరఫరా చేస్తామని ఎప్పుడు చెప్పలేదని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో జరిగిన అన్ని విద్యుత్ ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని అన్నారు.సోలార్ పవర్‌ పస్తుతానికి 8000 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని అన్నారు.


సోలార్ పవర్‌కు సంబంధించి సెకండ్ ర్యాంక్ వచ్చిందని, మరోవైపు తెలంగాణ విద్యుత్ సంస్థకు ఏప్లస్ రేటింగ్ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు . తాను పూర్తి అవగాహనతోనే విద్యుత్ ఒప్పందాలపై మాట్లాడానని చెప్పుకొచ్చారు . విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన సవాల్ చేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: