రాహుల్  గాంధీ  నేతృత్వంలోని విపక్షాల బృందం  ఈ రోజు కశ్మీర్‌లో పర్యటించడానికి  బయల్దేరింది. ఈ బృందం  అక్కడ పర్యటించి  కశ్మీర్ లో నెలకొన్నతాజా  పరిస్థులను తెలుసుకోనుంది. అందులో భాగంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజల్లో ఎలాంటి పరిస్థితులన్ని ఎదుర్కొంటున్నారనే విషయాలపై అక్కడి ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.  అదేవిధంగా ప్రభుత్వం అనుమతిస్తే సమస్యాత్మకంగా ఉన్న శ్రీనగర్ ప్రాంతంలో పర్యటించాలని ఈ బృందం  భావిస్తుంది. 




కాంగ్రెస్‌ తో పాటు  సీపీఎం, సీపీఐ, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ, టీఎంసీ, డీఎంకే పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.  అందులో భాగంగా ఈ బృందంలో రాహుల్‌ సహా గులాం నబీ ఆజాద్‌, కేసీ.వేణుగోపాల్‌, ఆనంద్‌ శర్మ, డి.రాజా, సీతారాం ఏచూరి, తిరుచ్చి శివ, మనోజ్‌ ఝా, దినేశ్‌ త్రివేది, మజీద్‌ మెమన్‌, కుపేంద్ర రెడ్డి  వున్నారని సమాచారం.ఇక   విపక్షాల పర్యటనలో  నేపథ్యంలో  ప్రభుత్వం అప్రమత్తమైంది.  శ్రీనగర్‌ సహా లోయలోని ఇతర ప్రాంతాల్లోనూ తిరిగి ఆంక్షలను విధించారు. 



ఇక  ఓ వైపు జమ్ము కశ్మీర్ లో  నిషేదాజ్ఞలు కొనసాగుతున్న వేళ  విపక్ష అగ్రనాయకుల పర్యటన వల్ల  శాంతి భద్రతలకు  విఘాతం కలిగించే అవకాశం ఉందని  అధికారులు భావిస్తున్నారు.   ఈ నేపథ్యంలో సీనియర్ నాయకులు ఇక్కడ పర్యటించవద్దని  అధికారులు కోరగా ..   విపక్ష బృందం మాత్రం వినిపించుకోలేదు.  కాగా  తాజా పర్యటననిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక  ఇదిలావుంటే ప్రస్తుతం  శ్రీనగర్‌ శివార్లలో ఘర్షణ వాతావరణం నెలకొంది.  సౌర వద్ద  శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తరవాత సుమారు 300 మంది నిరసనలకు దిగడంతో  వెంటనే అప్రమత్తమైన బలగాలు నిరసనకారులపై   లాఠీఛార్జి చేసి చెదరగోట్టాయి.ఈ నేపథ్యంలో  కశ్మీర్ లో విపక్షాల పర్యటన ఫై ఉత్కంఠత  నెలకొంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: