మనిషి మనుగడ ప్రస్తుతం ఇబ్బందికరంగా మారుతున్నట్టు కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా మనిషి మనుగడకు కారణమైన అడవులు తగలబడి పోతున్నాయి. ప్రపంచం మొత్తం మీద అడవుల్లో ఎక్కువ శాతం అడవులు ఉన్న ఖండం దక్షిణ అమెరికా. దాదాపు 6 దేశాల్లో ఈ అడవులు వ్యాపించి ఉన్నాయి. ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో. ఈ అమెజాన్ అడవుల్లో 30 లక్షల చెట్లు ఉన్నాయి. వేలాది జీవజాతులు నివసిస్తున్నాయి. అంతేకాదు, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి రెండు రోజులకు ఒక కొత్త జాతి జీవం లేదా కొత్తజాతి చెట్టు ఆవిర్భవిస్తూ ఉంటుంది.
ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డై ఆక్సైడ్ లో అత్యధిక భాగం ఈ అమెజాన్ ఫారెస్ట్ పీల్చుకుంటుంది. ప్రపంచానికి కావాల్సిన ఆక్సిజన్ లో 20శాతం అమెజాన్ అడవి నుంచి లభిస్తుంది. అలాంటి అడవులు ప్రస్తతం తగలబడిపోతున్నాయి. దీనికి కారణం ఎవరు.. ఎందుకు ఇలా జరిగింది.
భూతాపాన్ని సమతూకంగా ఉంచే అమెజాన్ అడవులు నాశనం కావడం వలన జరిగే నష్టం ఎంత ఏంటి అని అంచనా వేసుకోవచ్చు.
అమెజాన్ అడవులు తగలబడి పోవడానికి అసలు కారణం అక్కడి ప్రభుత్వం నిర్లక్షమే. అడవుల్లో నివసించే ఆదిమజాతి ప్రజలు మొక్కలను ఉపయోగించుకుంటున్నారని, మైదాన ప్రాంతానికి ఆనుకొని ఉన్న అడవుల్లోని మనుషులు మైదానంలో ఉండే రైతుల కంటే ఎక్కువ భూములు కలిగి ఉంటున్నారని చెప్పి.. అడవులను నరికేస్తున్నారు.
ఇలా చెట్లను నరకడం.. భూమిని చదునే చేసేం సమయంలో చెలరేగే మంటలు అడవిని కాల్చివేస్తున్నాయి. రైన్ ఫారెస్ట్ లో ఇలా మంటలు రావడం అన్నది అసాధారణమైన విషయమే అని చెప్పాలి. అమెజాన్ అడవుల్లో మంటలు చెలరేగడం కొత్తేమి కాదు. 2013 ప్రాంతంలో కూడా ఈ అడవుల్లో మంటలు చెలరేగాయి. కానీ, అవి అదుపులోనే ఉన్నాయి. ఇప్పుడు సంభవించిన ఈ మంటలు దారుణంగా ఉన్నాయి.
ఈ మంటల కారణంగా అరుదైన మొక్కలు, జంతువులు మరణిస్తున్నాయి. కేవలం అడవుల్లో ఉండే జంతువులే కాదు.. ఆ పొగవలన అడవికి చుట్టుపక్కల ఉన్న పట్టణ, నగర ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడితో ఆగితే బెటరే. అయితే, ఈ అడవిలో చెలరేగిన మంటల తాలూకు పొగ అక్కడికి 3200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్ రాజధాని సావోపోలో వరకు వ్యాపించింది. అక్కడి వాతావరణాన్ని నల్లగా మార్చేసింది. ఇదిలా కొనసాగితే.. మనిషి మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుందనడంలో సందేహం అవసరం లేదు.