విదేశీ మదుపర్ల స్వర్గధామం -  భారతదేశం

రానున్న రోజులు  విదేశీ మదుపర్లు భారతదేశం   పైన ఎక్కువగా ఆధారపడే అవకాశం  ఉన్నది. ప్రపంచ ఆర్ధిక రంగం తిరోగమనంలో ఉంటే  మన దేశం మాత్రం ప్రభుత్వం యొక్క ముందు జాగ్రత్త మరియు ఉద్దీపన చర్యల ద్వారా  భవిష్యత్తు ఆర్థిక స్వర్గధామంగా మన దేశాన్ని తయారు చేస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న  ఉద్దీపన చర్యల వల్ల మన దేశానికి విదేశీ మదుపరులు వెల్లువ ఎత్తుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు ప్రకటించిన  ఈ ఉద్దీపన చర్యలు చాలా బాగున్నాయి అని భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థను  దిశానిర్దేశం చేసి సరైన దారిలో నడిపించే విధంగా ఉన్నాయని అమెరికా వ్యాపార వర్గాలు కూడా మెచ్చుకున్నాయి.  మన దేశ ఆర్థిక మంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని భారత-అమెరికా వ్యాపార వర్గాల వారు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో  పయనిస్తున్నా ఈ సమయంలో భారత ప్రభుత్వంసత్వరమే మేలుకొని  విదేశీ మదుపర్లు మరియు అంకురాలు పై విధించే పలు రకాల పన్ను లను రద్దు చేసి,  మన దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో చిక్కుకోకుండా తీసుకున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా  ఆర్థికవేత్తల అందరి అభినందనలు అందుకుంటూ, విదేశీ మదుపర్లను ఆకర్షించే విధంగా ఉన్నాయని  చెప్పవచ్చు



మరింత సమాచారం తెలుసుకోండి: