Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 10:44 am IST

Menu &Sections

Search

టుడే టాప్ 10 న్యూస్

టుడే టాప్ 10 న్యూస్
టుడే టాప్ 10 న్యూస్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1)  ఉగ్రవాదుల టార్గెట్‌లో తిరుమ‌ల‌... ఇంటిలిజెన్స్ ఏం చెప్పింది...

మూడ్రోజులుగా లష్కరె తోయిబా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని వార్తలు అందుతూనే ఉన్నాయి. ఈ వార్త‌ల‌తో దేశ‌వ్యాప్తంగా ఒక్క‌సారిగా తీవ్ర క‌ల‌క‌లం రేగుతోంది. ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌తి రాష్ట్ర పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి. ఉగ్ర‌వాదుల ఏ ప్రాంతాల‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారో ?  కూడా చెపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉగ్ర‌వాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి వచ్చారని సమాచారం. శుక్రవారం సాయంత్రానికి మరో హెచ్చరిక జారీ అయింది.

పూర్తి వివరాలకు https://bit.ly/2U7ukuo


2)  కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇక లేరు 

కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ కన్నుమూశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు జైట్లీ. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఈనెల 8న ఎయిమ్స్‌లో చేర్చారు కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి ఎయిమ్స్‌ డాక్టర్లు చికిత్స అందించారు.  ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షించారు. గుండె సంబంధిత విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. శ్వాస తీసుకొనేందుకు ఆయన ఇబ్బంది పడుతుండటంతో ఈసీఎంవో కూడా అమర్చారు. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/2ZauIxU


3)  హవ్వ ...కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను పంపిణీ చేస్తారా ?

వరద బాధితులంటే అధికారులకు ఎంత అలుసో తెలియజేసే సంఘటన గుంటూరు జిల్లా లో చోటు చేసుకుంది .  వరదలకు సర్వస్వం కోల్పోయి బాధపడుతున్న ప్రజలను అన్ని విధాలుగా  ఆదుకోవాల్సిన అధికారులు, వారిని   మరింత క్షోభకు గురిచేసేలా  వ్యవహరించారు. వరద బాధితులకు అందించిన ఆహార సామగ్రిలో కాలం చెల్లిన వంటనూనె ప్యాకెట్లను అందించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి   https://bit.ly/2ZxR77S


4)  జగన్ సర్కార్ 70 రోజుల పాలన... ?  మేము రంగంలోకి దిగితే...!!

ఏపీలో వైఎస్ జగన్ 70 రోజుల పాలనపై భిన్న వాదనలు ఉన్నాయి. బాగుందని కొందరు అంటే దశా దిశా లేదని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ పాలనపీ ఏకగ్రీవ అభిప్రాయం మాత్రం లేదు. అయితే పాలన ఇంకా మొదలు కాలేదని వైసీపీ నేతలు ఓ వైపు చెబుతూంటే తొలి రెండు రీళ్ళు  సిన్మా చూసి ఫ్లాప్ అనేస్తున్న వారు మరికొందరు. ఈ జాబితాలో టీడీపీ పక్కన బీజేపీ కూడా నిలిచింది. బీజేపీకి జగన్ పరిపాలన అసలు నచ్చడంలేదుట. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2MCWtse


5)   మోదీకి యుఎఇ అత్యుత్తమ పురస్కారం

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి ప్రశంసల చిహ్నంగా ప్రధాని నరేంద్రమోదీకి యుఎఇ  లోని అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ తో శనివారం సత్కరించారు. ఈ అవార్డును ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, క్వీన్ ఎలిజబెత్ II మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సహా పలువురు ప్రపంచ నాయకులకు అందజేశారు. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/30vy0Iz


6) రాజ‌ధాని మార్పుపై ప‌వ‌న్ కామెంట్‌... ఏం చెప్పాడంటే..

గత వారం రోజులుగా రాజధాని అమరావతి విషయంలో రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వరదలు వచ్చిన నేపథ్యంలో రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలకు తగ్గట్టుగా మంత్రి సత్యనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటనలు రాజధాని విషయంలో ప్రజలని అయోమయంలో పడేశాయి. వరద ముంపు ఉంది కాబట్టి రాజధాని నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని, మార్పు విషయంమై ఆలోచిస్తున్నామని మంత్రి ప్రకటన చేశారు. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2L2JHA2


7)  జ‌గ‌న్‌పై సుజ‌నా యూట‌ర్న్‌... వార్నింగ్ ఎక్క‌డ నుంచి...!

ఇటీవల బీజేపీ లో చేరిన దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీ ఎంత హడావిడి చేస్తున్నారో అందరికీ తెలుసు. మొన్నటివరకు టీడీపీలో కీలక పాత్ర పోషించిన సుజనా బీజేపీలో కూడా తన హవా కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ హైలైట్ అవ్వాలని అనుకుంటున్నారు.పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2PcfvYr


8) భారత క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం

శ్రీశాంత్ నివాసంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేరళలోని తిరువనంతపురం ఎడపల్లిలో ఉన్న శ్రీశాంత్ నివాసంలో అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుఝామున 2 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో శ్రీశాంత్ నివాసంలో లేడు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నట్టు సమాచారం. అతని భార్యా, పిల్లలు నిద్రలో ఉన్న సమయంలో ఇంటి మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి.పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/2PdegbH


9)  జగన్ క్యాబినేట్లో అయిదేళ్ళ మంత్రులు వారేనా...!?
జగన్ తాను కాకుండా పాతిక మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాత కొత్త కలుపుకుని అంతా ఉన్నారు. ఇక సామాజికవర్గాల పరంగా చూసుకున్నా బీసీలకు జగన్ పెద్ద పీట వేశారు. దాంతో మంత్రివర్గంలో జూనియర్ల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. వందరోజుల పాలనకు దగ్గరవుతున్న జగన్ మంత్రుల పనితీరుని అంచనా వేయడం అపుడే స్టార్ట్ చేశారట. మరి జగన్ ఎవరెరవరికి మార్కులు వేశారో చూస్తూంటే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2KVP9WN


10) బీజేపీకి ఆగస్ట్ గండం...వరస విషాదాలు...!!
భారతీయ జనతా పార్టీ హైందవ ధర్మాన్ని పాటించే పార్టీ. పూర్తిగా సెంటిమెంట్లు ఉన్న పార్టీ. ఆ పార్టీకి ఇపుడు రోజులు బాలేవు అని చెప్పాలేమో. మరీ ముఖ్యంగా ఆగస్ట్ నెల గండం బీజేపీని పట్టి పీడిస్తోంది. ఇదే నెలలో వరసగా ఇద్దరు ప్రముఖ నాయకులను కోల్పోయిన విషాదాన్ని మాటల్లో ఎంత చెప్పినా తీరనిది. వాళ్ళు సీనియర్ యకులు,  రాజకీయ దిగ్గజాలు, బీజేపీని ముందుండి నడిపించిన వారు. అటువంటి కీలకమైన నేతలను కోల్పోవడం అంటే బీజేపీకి  పెను విషాదమే. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/2KSRXUA
1) ఉగ్రవాదుల టార్గెట్‌లో తిరుమ‌ల‌... ఇంటిలిజెన్స్ ఏం చెప్పింది...
మూడ్రోజులుగా లష్కరె తోయిబా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని వార్తలు అందుతూనే ఉన్నాయి. ఈ వార్త‌ల‌తో దేశ‌వ్యాప్తంగా ఒక్క‌సారిగా తీవ్ర క‌ల‌క‌లం రేగుతోంది. ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌తి రాష్ట్ర పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి. ఉగ్ర‌వాదుల ఏ ప్రాంతాల‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారో ?  కూడా చెపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉగ్ర‌వాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి వచ్చారని సమాచారం. శుక్రవారం సాయంత్రానికి మరో హెచ్చరిక జారీ అయింది. 
2)కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇక లేరు 
కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ కన్నుమూశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు జైట్లీ. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఈనెల 8న ఎయిమ్స్‌లో చేర్చారు కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి ఎయిమ్స్‌ డాక్టర్లు చికిత్స అందించారు.  ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షించారు. గుండె సంబంధిత విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. శ్వాస తీసుకొనేందుకు ఆయన ఇబ్బంది పడుతుండటంతో ఈసీఎంవో కూడా అమర్చారు. ఆయనకు లైఫ్‌ సపోర్ట్‌పై ఉంచారు. ఇవేవి ఆయన్ను బతికించలేకపోయాయి. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఇటీవల అమెరికాకు వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు జైట్లీ. తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత కూడా చికిత్స కొనసాగించారు. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు.
3)హవ్వ ...కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను పంపిణీ చేస్తారా ?
వరద బాధితులంటే అధికారులకు ఎంత అలుసో తెలియజేసే సంఘటన గుంటూరు జిల్లా లో చోటు చేసుకుంది .  వరదలకు సర్వస్వం కోల్పోయి బాధపడుతున్న ప్రజలను అన్ని విధాలుగా  ఆదుకోవాల్సిన అధికారులు, వారిని   మరింత క్షోభకు గురిచేసేలా  వ్యవహరించారు. వరద బాధితులకు అందించిన ఆహార సామగ్రిలో కాలం చెల్లిన వంటనూనె ప్యాకెట్లను అందించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .  వరద బాధితులకు అందజేసిన  నూనె ప్యాకెట్ల వినియోగ కాలపరిమితి,  గత నెలతో ముగిసినప్పటికీ అధికారులు అవే నూనె  ప్యాకెట్లను వరద బాధితులకు అంటగట్టడం విస్మయాన్ని కలిగిస్తోంది .  ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలంలో వెలుగులోకి వచ్చింది.
4)జగన్ సర్కార్ 70 రోజుల పాలన... ?  మేము రంగంలోకి దిగితే...!!
ఏపీలో వైఎస్ జగన్ 70 రోజుల పాలనపై భిన్న వాదనలు ఉన్నాయి. బాగుందని కొందరు అంటే దశా దిశా లేదని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ పాలనపీ ఏకగ్రీవ అభిప్రాయం మాత్రం లేదు. అయితే పాలన ఇంకా మొదలు కాలేదని వైసీపీ నేతలు ఓ వైపు చెబుతూంటే తొలి రెండు రీళ్ళు  సిన్మా చూసి ఫ్లాప్ అనేస్తున్న వారు మరికొందరు. ఈ జాబితాలో టీడీపీ పక్కన బీజేపీ కూడా నిలిచింది. బీజేపీకి జగన్ పరిపాలన అసలు నచ్చడంలేదుట. జగన్ పాలనలో జనం నానా అవస్థలు పడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు. పాలించడంలో తడబాట్లు ఉన్నాయని, పొరపాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ పాలన చూసిన తరువాత కట్టు బట్టలతో జనం పొట్ట చేత పెట్టుకుని వలసలకు పోతున్నారని కూడా బీజేపీ నేత రాం మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు.
5) మోదీకి యుఎఇ అత్యుత్తమ పురస్కారం
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి ప్రశంసల చిహ్నంగా ప్రధాని నరేంద్రమోదీకి యుఎఇ  లోని అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ తో శనివారం సత్కరించారు. ఈ అవార్డును ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, క్వీన్ ఎలిజబెత్ II మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సహా పలువురు ప్రపంచ నాయకులకు అందజేశారు. " యుఎఇ వ్యవస్థాపక తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరిట ఈ అవార్డు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఇది షేక్ జాయెద్ పుట్టిన శతాబ్ది సంవత్సరంలో ప్రధానమంత్రి మోడీకి
లభించినందున ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది " అని విదేశాంగ మంత్రిత్వ శాఖ   ఒక ప్రకటనలో తెలిపారు.
6)రాజ‌ధాని మార్పుపై ప‌వ‌న్ కామెంట్‌... ఏం చెప్పాడంటే..
గత వారం రోజులుగా రాజధాని అమరావతి విషయంలో రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వరదలు వచ్చిన నేపథ్యంలో రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలకు తగ్గట్టుగా మంత్రి సత్యనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటనలు రాజధాని విషయంలో ప్రజలని అయోమయంలో పడేశాయి. వరద ముంపు ఉంది కాబట్టి రాజధాని నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని, మార్పు విషయంమై ఆలోచిస్తున్నామని మంత్రి ప్రకటన చేశారు.
7) 'బాహుబలి 2,  సైరా, సాహో' రికార్డులు బద్దలు కొడుతుందట ! 
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన `కేజీఎఫ్ చాప్టర్— 1` సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.  కన్నడం, హిందీ, తెలుగు, త‌మిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది.  అందుకే యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి.  మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమా కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు.  ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ అయితే ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలు అన్ని ఇన్ని కావు. కానీ ఇదే సందర్భంలో ఎన్నో అంచనాలను మూటగట్టుకున్న ఈ చిత్రం “బాహుబలి 2″  రికార్డులను రాబోతున్న సాహో, సైరా చిత్రాలు నెలకొల్పే రికార్డులను  సైతం కొట్టేస్తుందని కొంత మంది అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే నిజంగా కేజీఎఫ్ సినిమాకు అంత సీనుందా అంటే అంచనాలు పెట్టుకొవడంలో తప్పు లేదు కానీ  వాస్తవంగా అయితే ఈ సినిమాకు అంత సీన్ లేదనే చెప్పాలి. 
8)భారత క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం
శ్రీశాంత్ నివాసంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేరళలోని తిరువనంతపురం ఎడపల్లిలో ఉన్న శ్రీశాంత్ నివాసంలో అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుఝామున 2 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో శ్రీశాంత్ నివాసంలో లేడు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నట్టు సమాచారం. అతని భార్యా, పిల్లలు నిద్రలో ఉన్న సమయంలో ఇంటి మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ మంటలను గమనించిన ఓ వ్యక్తి వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేశారు. ఇంటి అద్దాలు పగులగొట్టి ఇంట్లోవారిని కాపాడారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదం నుంచి శ్రీశాంత్ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. అయితే.. మంటలు బాగా వ్యాపించడంతో భారీ మొత్తంలో ఆస్తినష్టం జరిగినట్టు సమాచార. సీలింగ్ ఫ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని శ్రీశాంత్ తెలిపాడు.
9)జగన్ క్యాబినేట్లో అయిదేళ్ళ మంత్రులు వారేనా...!?
జగన్ తాను కాకుండా పాతిక మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాత కొత్త కలుపుకుని అంతా ఉన్నారు. ఇక సామాజికవర్గాల పరంగా చూసుకున్నా బీసీలకు జగన్ పెద్ద పీట వేశారు. దాంతో మంత్రివర్గంలో జూనియర్ల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. వందరోజుల పాలనకు దగ్గరవుతున్న జగన్ మంత్రుల పనితీరుని అంచనా వేయడం అపుడే స్టార్ట్ చేశారట. మరి జగన్ ఎవరెరవరికి మార్కులు వేశారో చూస్తూంటే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.
10)బీజేపీకి ఆగస్ట్ గండం...వరస విషాదాలు...!!
భారతీయ జనతా పార్టీ హైందవ ధర్మాన్ని పాటించే పార్టీ. పూర్తిగా సెంటిమెంట్లు ఉన్న పార్టీ. ఆ పార్టీకి ఇపుడు రోజులు బాలేవు అని చెప్పాలేమో. మరీ ముఖ్యంగా ఆగస్ట్ నెల గండం బీజేపీని పట్టి పీడిస్తోంది. ఇదే నెలలో వరసగా ఇద్దరు ప్రముఖ నాయకులను కోల్పోయిన విషాదాన్ని మాటల్లో ఎంత చెప్పినా తీరనిది. వాళ్ళు సీనియర్ యకులు,  రాజకీయ దిగ్గజాలు, బీజేపీని ముందుండి నడిపించిన వారు. అటువంటి కీలకమైన నేతలను కోల్పోవడం అంటే బీజేపీకి  పెను విషాదమే.
ap-politics-2019-top ten news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.