భారత మాజీ ఆర్థిక  మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఇది భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని దెబ్బ. నెల రోజుల వ్యవధిలోనే భాజాపా ఇద్దరు కీలక నేతలను కోల్పోయింది. సరిగ్గా ౧౮ రోజుల క్రితం మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కార్డియాక్ అరెస్ట్ వల్ల స్వర్గస్థురాలైంది. వీరి మరణం భాజాపా వర్గాలను మనోవేదనకి గురి చేసింది. దేశం గర్వించదగ్గ ఇద్దరు నేతలను నెల రోజుల వ్యవధిలో కోల్పోవడం మన దురదృష్టం.


అయితే ఈ ఇద్దరు నేతలకి చాలా విషయాల్లో పోలికలున్నాయి. ముఖ్యంగా ఇద్దరూ న్యాయవాద వృత్తి నుండి రాజకీయాల్లోకి వచ్చిన వారే. అరుణ్ జైట్లీ సుప్రీం కోర్టుతో పాటు పలు హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. వీపీ సింగ్‌ ప్రభుత్వంలో ఆయన అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా వ్యవహరించారు. న్యాయవాద వృత్తిలో ఎన్నో పదవులు అలంకరించారు. భారత ప్రభుత్వం తరఫున ఎన్నో అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నారు. 


 సుష్మా స్వరాజ్ కూడా 1973లో సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. అరుణ్ జైట్లీ  1999  సార్వత్రిక ఎన్నికల తర్వాత వాజ్ పేయీ ప్రధానిగా ఉన్న హయాంలో  సమాచార శాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. జైట్లీ కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ దేశ రాజకీయాల్లో కనిపించడానికి సుష్మ కాస్త సమయం పట్టింది.1990లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.  1996లో తొలిసారిగా సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా, సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వీరిద్దరికీ ఎవరితోనూ శతృత్వం లేదు. విపక్షాలతో సైతం స్నేహంగా ఉండేవారు. అంతే కాదు అరుణ్ జైట్లీ పిల్లలు కూడా న్యాయవాద వృత్తినే ఎంచుకున్నారు. అలాగ్ సుష్మా స్వరాజ్ తన ఏకైక కుమార్తెను కూడా క్రిమినల్ లాయర్ ని చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: