గడచిన ఏడాది నుండి బిజేపీ కి సుఖ దు:ఖాలు కలిసి వస్తున్నాయి. దేశం లో తిరుగు లేని విధంగా పార్టీ గెలిపొంది బలపడుతుంటే అందులో ఇప్పటి వరకు కష్టపదిన ముఖ్య నేతలు ఒకొక్కరిగా తుది శ్వాస విడిచారు. గత సంవత్సరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కోల్పోయింది , ఈ ఏడాది లో  కేంద్ర మాజీ మంత్రులు అనంత్ కుమార్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలను కూడా వరుసగా కోల్పోయింది. జైట్లీని కేవలం నాయకుడీగానే కాకుండా  సన్నిహితుడిగా భావిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.


వాజ్పేయి మరియు  అద్వానీ చేత తయారు చేయబడిన రెండవ తరం,   మాజీ మంత్రులు ప్రమోద్ మహాజన్ మరియు గోపీనాథ్ ముండేల  అకాల మరణాల సమయం లో  బిజెపికి  పార్టీ చాలా వరకు పోయినట్టూ అయిపొయింది.  ఇప్పుడు  జైట్లీ మరణం, ఈ  నాయకుల సమూహ  నష్టాన్ని నొక్కిచెప్పడంలో కూడా ముఖ్యమైనది ఎందుకంటే ఈయన కూడా ఆ తరానికి నేటీ తరం నాయకులకు వారధిలా ఉండేవారు.


 
ఆర్‌ఎస్‌ఎస్  ఆర్గనైజర్ మాజీ సంపాదకుడు శేషాద్రి చారి మాట్లాడుతూ   "వీరు వాజ్‌పేయి నేతృత్వంలోని పాత జనసంఘ్, రాజమాతా విజయ రాజే సింధియా మరియు సుందర్ సింగ్ భండారి  వంటీ నాయకులకు మరియు  అత్యవసర పరిస్థితి తరువాత ఉద్భవించిన కొత్త తరం నేతల మధ్య  వీరంతా ఒక  “వారధి తరం”  లాంటి వారు"  అని అన్నారు.

 "వీరంతా అత్యవసర పరిస్థితి తరువాత వచ్చిన నాయకులు, ఆధునికత యొక్క ఆలోచనలతో జాన్ సంఘ్ యొక్క భావజాలాన్ని అనుసంధానించడానికి, అత్యవసర సున్నితత్వాలను చేరవేయాడానికి సహాయపడ్డారు" అని ఆయన చెప్పారు.

ఈ నాయకులందరూ మంచి వ్యూహకర్తలు మరియు వారితో పాటు ప్రజలు  ఎల్లప్పుడూ ఉన్నారని ఆయన అన్నారు. "వారు ఇంకొక ఐదేళ్ళు  బతికి ఉంటే, కొత్త తరం నాయకత్వం మరింత వృద్ధి చెంది ఉండేది," అని ఆయన అన్నారు. వారి నాయకత్వం బిజెపికి ప్రజలలో స్థానం సంపాదించడానికి ఎంతగానో సహాయపడింది, మరియు కాంగ్రెస్ కాని ప్రభుత్వం స్థిరమైన పాలన నమూనాలను అందించగలదని భారత ఓటర్లకు రుజువు చేయడంలో వారి ప్రాముఖ్యత ఉందని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: