నారా లోకేశ్ .. తెలుగుదేశం పార్టీలో నెంబర్ వన్.. మొన్నటి ఎన్నికల్లో తెలుగు దేశం గెలిచి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ సీఎం సీటుకు దగ్గరయ్యేవాడు.. పాపం.. ఏకంగా తాను కూడా మంగళగిరిలో ఓడిపోయేసరికి ఆయన క్రేజ్ బాగా తగ్గింది. రాజకీయాల్లో గెలుపోటములే కదా ప్రమాణం చాలా మందికి.


ఐతే.. ఎన్నికల తర్వాత లోకేశ్ ప్రవర్తన కూడా చాలా తేడాగా ఉంది. ఆయన అస్సలు ప్రజల్లోకి రావడం బాగా తగ్గించారు. నేరుగా జనానికి కనిపించడం మానేసి ఎక్కువగా ట్వీట్లతోనే వార్తల్లో కనిపిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇటీవల లోకేశ్ ట్వీట్లు మరీ నాసిరకంగా ఉంటున్నాయి. వైసీపీ సర్కారు నిర్ణయాలపై, పాలనపై ప్రతి రోజూ రెండు ట్వీట్లు విషయం ఉన్నా లేకపోయినా పెట్టడం కామన్‌ అయ్యింది.


ఒక్కోసారి ఆ ట్వీట్లు ఎంత నాసిరకంగా ఉంటున్నాయంటే... శనివారం ప్రకాశం బ్యారేజీ వద్ద చేపల కోసం వెళ్లి ఓ వృద్దుడు కాలుజారి నీళ్లలో కొట్టుకుపోయాడు.. ఈత రాక ఈదలేక చనిపోయాడు.. ఆ సమయంలోనే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుకున్న బోటు తొలగింపు పనులు పర్యవేక్షిస్తున్నారు. లోకేశ్ ఆ విషయం ప్రస్తావిస్తూ.. ఓ ట్వీట్ పెట్టారు..


ప్రకాశం బ్యారేజి గేటుకి అడ్డంగా ఉన్న చిన్నబోట్ తియ్యలేని.. చేతగాని ప్రభుత్వం ఇది అని ఆయన దుయ్యబట్టారు.  ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి మరీ ఇంత చులకనేంటని లోకేష్ కామెంట్ చేశారు.  గేట్లు తెరిచే ముందు కనీస హెచ్చరికలు చేయాలని తెలీదా అంటూ ప్రశ్నించారు. ఏమిటీ అహంకారమని ఆగ్రహం వ్యక్తంచేశారు.  మంత్రి సమక్షంలోనే ఇలా జరగడం దారుణమన్న లోకేష్‌... ప్రజల రక్షణలో ప్రభుత్వం వంద శాతం విఫలమయ్యిందని విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం  వివరణ ఇవ్వాలని.. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. కాలుజారి కొట్టుకుపోయిన విషయానికి కూడా ఇంత దారుణంగా ట్వీట్ చేయడం ఏంటో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: