ఆర్టికల్ 370 నిబంధనలను రద్దు చేసిన తరువాత అక్కడి పరిస్థితిని తెలుసుకోవడానికి కాశ్మీర్ లోయను సందర్శించాలనుకున్న రాహుల్ గాంధీ,మరి కొందరు సహా ప్రతిపక్ష నాయకుల ప్రతినిధి బృందం శనివారం శ్రీనగర్ విమానాశ్రయం నుండి బయటకి వెళ్ళడానికి రాష్ట్ర పరిపాలన అనుమతించలేదు దానితో వారు ఢిల్లీ కి  తిరిగి రావాల్సి వచ్చింది.


 శాంతి మరియు సాధారణ జీవితాన్ని క్రమంగా పునరుద్ధరించడానికి భంగం కలిగించే విధంగా లోయను సందర్శించవద్దని రాజకీయ నాయకులను కోరుతూ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటణ జరిగింది. ఈ మధ్యాహ్నం శ్రీనగర్‌కు వెళ్లిన గంటల్లోనే తిరిగి వచ్చిన తొమ్మిది రాజకీయ పార్టీల నాయకులు లోయలో "సాధారణ స్థితిఉన్నదా" అనే వాదనను ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 


"ప్రభుత్వం నన్ను ఆహ్వానించింది. గవర్నర్ నన్ను ఆహ్వానించారని చెప్పారు. ఇప్పుడు నేను వచ్చాను, మీరు రాలేరని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఇక్కడ అంతా సాధారణమని చెబుతోంది, కాబట్టి ప్రతిదీ సాధారణమైతే మమ్మల్ని ఎందుకు వెల్లనీయడం లేదు? " అని శ్రీనగర్ విమానాశ్రయంలో విలేకరులతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది తనకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు.  ఆయనతో పాటు సిపిఎం, సిపిఐ, డిఎంకె, ఎన్‌సిపి, జెడి (ఎస్), ఆర్‌జెడి, ఎల్‌జెడి, టిఎంసి నాయకులు ఉన్నారు. "మేము ప్రశాంతంగా ఉన్న ఏ ప్రాంతానికైనా వెళ్లి 10-15 మందితో మాట్లాడాలనుకుంటున్నాము. సెక్షన్ 144 ఉంటే, నేను ఒక్కడినే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, మేము ఒక సమూహంగా వెళ్ళవలసిన అవసరం లేదు" అని కూడా ఆయన అన్నారు. 


రాబోయే కొద్ది రోజులలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడానికి ప్రతినిధి బృందం ప్రణాళికలు సిద్ధం చేసిందని, కాశ్మీర్ లో ఉన్న పరిస్థితులను మరియు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి వివిధ వ్యక్తుల మరియు ప్రజలలోని వర్గాలతో,  రాజకీయ అభిప్రాయాల గురించి మాట్లాడాలని సిపిఎం తెలిపింది. 

"గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల  నాయకులకు ప్రవేశం నిరాకరించడం రాజకీయ పార్టీలు వారి నియోజకవర్గాలను కలవడానికి, అక్కడి ప్రజలకి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి   వారికి ఉన్న హక్కులను కాలరాస్తున్నారని,  ప్రవేశాన్ని తిరస్కరించడం  రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను  తేలికపాటి దోపిడీ చేయడం " అని సిపిఎం ఒక ప్రకటనలో పేర్కొంది .


మరింత సమాచారం తెలుసుకోండి: