ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.. ప్రతి విషయాన్ని తనఖాతాలో వేసుకుంటారని ఓ పేరు ఉంది. ఆయన ఇలా అతిగా చెప్పుకోవడం కారణంగా సోషల్ మీడియాలో బాగా చులకన అయ్యారు. ఆ మధ్య చంద్రబాబుపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. చంద్రబాబు వల్లే రాకెట్లు ఆకాశంలో వెళ్తున్నాయని.. గాంధీగారి దీక్ష సమయంలో బాబు ఉన్నాడని.. ఇలా అనేక జోకులు పేలాయి.


ఇప్పుడు అధికారం నుంచి దిగిపోయినా అదే తీరు కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. తన హాయంలో  చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం దేశమంతా ప్రశంసలు లభిస్తున్నాయని  తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన గొప్పలు చెప్పుకున్నారు. తన పాలనలో సమర్ధ నీటి నిర్వహణ వలన నీతి ఆయోగ్ ఏపీకి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును ఇచ్చిందని ఆయన వెల్లడించారు. 


కేవలం ఒక పాయింటు దూరంలో మొదటి ర్యాంకు కొల్పొయిందని చంద్రబాబు అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం గురించి అవగాహనలేని వైసీపీ వాళ్ళంతా నానా రకాలుగా మాట్లాడుతున్నారని..., మరి ఇప్పడు వైసీపీ సంగతేంటి అని ప్రశ్నించారు. ఈ మూడు నెలల్లోనే కృష్ణా, గోదావరి వరదల్లో 4 జిల్లాల్లో వేలాది కోట్ల పంట,ఆస్తి నష్టం జరగడం బాధాకరమని చంద్రబాబు కామెంట్ చేశారు.


తెలుగుదేశం పాలనకూ , వైసీపీ పాలనకూ అదే తేడా అంటున్నారు చంద్రబాబు. విపత్తు నిర్వహణ చేతకాకపోతే ఇంక ప్రభుత్వాలెందుకని ప్రశ్నించారు. హుద్ హుద్ తుఫాన్ లో 240కిలోమీటర్ల వేగంతో  ఈదురుగాలులు, భారీ వర్షాలతో విశాఖ వణికిందని... తిత్లి తుఫాన్ లో 180కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలతో శ్రీకాకుళం అల్లాడిందని చంద్రబాబు అంటున్నారు.


ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేశామని చంద్రబాబు తెలిపారు. గంటల వ్యవధిలోనే పునరావాస, సహాయ చర్యలతో బాధితులను ఆదుకున్నమన్న చంద్రబాబు వేలాదిమందికి ప్రతిరోజూ భోజనాలు, నాణ్యమైన నిత్యావసరాల పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఈ స్ఫూర్తి స్ఫూర్తి ఇప్పుడీ కృష్ణా, గోదావరి వరదల్లో ఏమైందని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా అడిగారు. మొత్తానికి బాబుగారు గొప్పలు చెప్పుకోవడం ఇంకా మానలేదన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: