ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలను జనాల వద్దకు తీసుకెళ్ళేందుకు ఆంధ్ర ప్రదేశ్ పేరు మీద ఓ మంత్లీ మ్యాగజైన్ కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. ఈ మ్యాగజైన్ ని 1952లో స్టార్ట్ చేశారు. సుదీర్ఘమైన చరిత్ర ఉన్న ఈ పత్రిక సర్కార్ గొంతుక. అప్పట్లో అంటే ఏ ఇతర సాధనం పెద్దగా  లేని రోజుల్లో ఈ పత్రిక ప్రాధాన్యత వేరు. అయితే ఇపుడు అంతా మారిపోయింది.


ప్రసారసాధనాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా అన్ని వస్తున్నాయి. ఇక ప్రభుత్వానికి సమాచార ప్రసార శాఖ సొంతంగా ఉంది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం ఆ శాఖ ద్వారా బాగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ అవసరం ఏముందని కొత్త సర్కార్  భావిస్తోందట. జగన్ ఇదే విషయాన్ని ఆ శాఖ సిబ్బందికి చెప్పేశారట.


పత్రిక మూసేయడం వల్ల నష్టం ఏమీ లేదని వైసీపీ సర్కార్ అభిప్రాయపడుతోంది. ఆ నిధులను సమాచార  ప్రసార శాఖకు మళ్ళించడం ద్వారా అక్కడ ఖర్చును తగ్గించుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని భోగట్టా. ఇదిలా ఉండగా పది మంది ఎడిటోరియల్ స్టాఫ్ తో అతి పెద్ద వేతనాలతో నెలకు ఒక మ్యాగజైన్ ని తీసుకువచ్చే ఆంధ్రప్రదేశ్ కి ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తోంది.


ఓ విధంగా తెల్ల ఏనుగు మాదిగిరా తయారైన ఈ మ్యాగజైన్ వల్ల ప్రభుత్వానికి ఉపయోగం కూడా లేదని అంటున్నారు. పత్రిక బయటకు వచ్చి జనాలు చూసి చాలా ఏళ్ళు అయింది. అందువల్ల మూసేయాలన్న జగన్ నిర్ణయం కరెక్ట్ అని అంతా అంటున్నారు. మొత్తానికి ప్రభుత్వ నిధులను  పొదుపు చేయడంలో జగన్ బాగనే ద్రుష్టి పెడుతున్నారని అంటున్నారు అంతా. గత టీడీపీ సర్కార్ భారీగా ఈ మ్యాగజైన్ కోసం ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: