ఈ సమాజంలో ఉన్న అందరు మంచివారే కాకపోతే నిజం భయటపడేంత వరకే.పెద్దపెద్ద హోదాలో వుండి ముసుగేసుకుని సంచరించే తోడేళ్లని చెప్పవచ్చు,ఎందుకంటే మంచితనం చాటున వారు చేసే అరాచకాలకు అంతేవుండదు.అలాంటిదే ఈ సంఘటన వీడొక పిల్లల డాక్టరట,పేరుకు చేసేది వైద్యం,కాని వీడి చూపుల్లో ఎప్పటికి నిండి వుంటుంది కామం.కోరిక కలిగితే ఆగలేడు, చిన్నా,పెద్దా,ఆడ,మగ అనే తేడానే తెలియదట.ఆ పిల్లల డాక్టర్ 250 మంది చిన్నారులపై లైంగిక దాడులు,అత్యాచారాలకు పాల్పడ్డాడు.అదేదో ఘనకార్యం చేసినట్లు డైరీలో రాసుకున్నాడు. చివరికి అదే ఈ కేసులో ఆధారం.ఇక వీడు ఎక్కడుంటాడో,తెలుసుకుందాం.



పశ్చిమ ఫ్రాన్స్‌లోని లా రోషెల్ నగరానికి చెందిన జోయెల్ లే స్కార్నెక్ అనే వైద్యుడు గత మూడు దశాబ్దాల్లో అతడి ఆసుపత్రికి వెళ్లే ఆడ,మగ పిల్లలపై లైంగిక దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.చిన్నారులను అసభ్యకరంగా ఫొటోలు తీసి దాచుకునేవాడట.ఈ కేసులో ఇదివరకే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని.విచారణ జరిపిన తర్వాత వైద్యం కొనసాగించేందుకు అవకాశం ఇచ్చారట.అయితే, 2017లో ఇవే ఆరోపణలతో ఆ డాక్టర్ మరోసారి అరెస్టయ్యాడు.అనుమానం వచ్చిన పోలీసులు మరింతలోతుగా వివరాలు సేకరించి,అతడు నాలుగు,ఆరేళ్ల వయస్సు గల చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.అయితే,జోయెల్ తరఫు న్యాయవాది ఆ ఆరోపణలను ఖండిస్తూ,వారిపై తన క్లయింట్ అత్యాచారం చేయలేదని,అసభ్యంగా మాత్రమే ప్రవర్తించాడని తెలిపాడు.



అతని వాదనను కొట్టిపడేస్తూ పోలీసులు పలు కీలక ఆధారాలను కోర్టుకు అందించారు.అందులో అతడు వివిధ హాస్పిటళ్లలో పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నప్పుడు అత్యాచారాలు,లైంగిక దాడులకు పాల్పడేవాడని తెలిపారు.గత 30 ఏళ్లల్లో అతడు 250 మందిపై అరాచకానికి ఒడిగట్టాడని,ఆ వివరాలను అతడే స్వయంగా డైరీలో నమోదు చేశాడన్నారు.లైంగిక దాడుల తర్వాత వారి పేర్లను నమోదు చేసి..లెక్కపెట్టుకొని రాక్షసానందం పొందేవాడని తెలుపారు.ఈ వైద్యుడిపై ఫిర్యాదు చేసిన ఓ బాధితురాలు మాట్లాడుతూ,ఆ డాక్టర్ నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశాడు.నేను మత్తులో అచేతనంగా ఉన్న సమయంలో నన్ను అనుభవిస్తూ తనకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో చెప్పాడని తెలిపింది.ఈ కేసు విషయంలో ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోగా, దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్‌లు అతడి డైరీలో పేర్కొన్న బాధితులను కలిసి వివరాలు సేకరించే పనిలో వున్నారు.నేరం రుజువైతే  కోర్టు అతడికి ఏ శిక్ష విధిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: